నవ పిరమిడ్

Print Friendly, PDF & Email
నవ పిరమిడ్
లక్ష్యం:

పిల్లలలో నూతనత్వం మరియు చురుకుదనాన్ని కోరుతూ ఒక ఉత్తేజకరమైన టీమ్-బిల్డింగ్ యాక్టివిటీ.

సంబంధిత విలువలు:
  • అప్రమత్తత
  • కలసిమెలిసి ఉండుట
  • విచక్షణ
  • చొరవ
కావలసిన పరికరములు:

కాగితం, పెన్ను / పెన్సిల్

గురువు ముందస్తుగా తయారుచేయావలసినది:

గురువు తన తరగతిలోని పిల్లల సంఖ్యకు అనుగుణంగా కొన్ని ఆకృతుల ఆధారంగా పదాల జాబితాను గురువు సిద్ధం చేయవలెను.

ఉదాహరణ:

పిరమిడ్, క్రాస్, త్రిశూల్, నక్షత్రం, స్వస్తిక్, డమరు, చెట్టు, చంద్రుడు, పర్వతం, వేణువు.

ఆట ఆడు విధానము:
  1. గురువు తన జాబితా నుండి ఒక పదాన్ని చెప్పవలెను (ఉదాహరణ: పిరమిడ్).
  2. పిల్లలందరూ కలిసి మానవ పిరమిడ్ను ఏర్పరచుకునే విధంగా తమను తాము ఏర్పరచుకొనవలెను.
  3. ప్రతి పిల్లలు ఈ మానవ పిరమిడ్లో భాగం అవవలెను.
  4. గురువు జాబితా నుండి ఒక్కొక్కటిగా పదాలను పిలుస్తూ ఆట కొనసాగుతుంది.
గురువులకు చిట్కాలు:

ప్రతి మానవ పిరమిడ్ పూర్తి అయిన తర్వాత ఆ ఏర్పాటు సంబంధిత ప్రశ్నలు అడగవచ్చును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *