గుర్తింపు రైలు బండి

Print Friendly, PDF & Email
గుర్తింపు రైలు బండి
లక్ష్యము:

తీర్థ యాత్ర అనే ఈ ఆటలో పిల్లలు పవిత్ర క్షేత్రాలు, దేవతలను భక్తితో గౌరవంతో గుర్తు చేసుకుంటారు.

సంబంధిత విలువలు:
  • ఊహా శక్తి
  • ఏకాగ్రత
  • జ్ఞాపక శక్తి
  • భక్తి
  • కుతూహలం
అవసరమైనవి:

ఏమీ లేవు

ముందస్తు తయారీ:

లేదు

ఎలా ఆడాలి
  1. పిల్లలను వృత్తాకారం లో కూర్చోమనాలి.
  2. ఒక ఉదాహరణతో గురువు ఆటను వివరిస్తారు.
  3. మొదట ఒక చిన్నారి “నేను పూరీ యాత్ర వెళ్లి జగన్నాధ స్వామి ని చూశాను” అని చెప్తాడు.
  4. ఇలా అందరూ ఒక్కో తీర్ధ స్థలము, అక్కడి దేవుని గురించి చెప్తారు.
  5. ఎవరైతే వారి యాత్ర గురించి గుర్తు పెట్టుకోలేరో, లేదా వేరే వాళ్ళు చెప్పిందే, మళ్ళీ చెపితే ఔట్ అయినట్టు.
గురువులకు సూచనలు:
  • యత్రా స్థలాల గురించి చ ర్చించుకోవచ్చు. పిల్లలు చేసిన వివిధ యాత్రల అనుభవాలను కూడా పంచుకోవచ్చు.