పరిశుభ్రత

Print Friendly, PDF & Email
పరిశుభ్రత
ఉపాధ్యాయుడు ఇస్తున్న సూచనలను అనుసరించండి….
పారే నీటి సవ్వడి, ప్రకృతి ధ్వనులు,నీటిలో తిమింగలములు నీటిలో చేయు ధ్వనులు మరియు ఇంపైన సంగీతమును వినండి.

(మీకు అవసరమైతే) నేపథ్యంలో మృదువైన సంగీతాన్ని వినటానికి పెట్టుకోండి.

ఒకవేళ అనుకూలంగా ఉంటే మధ్యలో ఒక అడుగు స్థలం ఉండేలాగా వృత్తాకారంలో పిల్లల్ని కూర్చో నివ్వండి.అలా లేనిచో వారిని కుర్చీలో కానీ, సుఖాసనంలో కానీ కూర్చోమనండి.

వెన్నెముకను,తలను నిటారుగా ఉంచండి.

మెల్లగా, దీర్ఘంగా శ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.

కళ్ళు మూసుకోండి, మీకు అసౌకర్యంగా ఉంటే, నేలవైపు చూడండి.

మళ్ళీ దీర్ఘ శ్వాసను తీసుకోండి.

మీరు మీ స్నేహితులతో ఫుట్ బాల్ ఆడుతున్నారని ఊహించుకోండి.

అక్కడ వున్న మట్టిని, మీరు అంటించుకున్నారు.

మీ బట్టలకు కూడా మట్టి అంటుకున్నది చూడండి.

ఇప్పుడు ఇంటికి వెళ్లే సమయం అయింది.

మీరు ఇంట్లోకి వెళ్ళే ముందు మట్టంటుకున్న మీ బూట్లను బయట విప్పండి.

ఇప్పుడు స్నానాల గదికి వెళ్లి మీ మురికి బట్టలు తీసేసి, శుభ్రంగా స్నానం చేయండి.

ఇప్పుడు మీరు చాలా శుభ్రంగా ఉన్నట్లుగా చక్కటి అనుభూతిని పొందుతారు.

మీ మురికి బట్టలు ఎక్కడ వేయాలో అమ్మని అడగండి.
మీరు శుభ్రంగా చక్కగా ఉన్నందుకు అమ్మ మిమ్మల్ని చూసి సంతోషిస్తుంది.
కొద్దిసేపు తర్వాత ఇప్పుడు నేను చిన్నగా చేసే గంటల శబ్దంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి, మీ పక్క కూర్చున్న వారిని చూసి నవ్వండి.

చర్చ:
  1. పైన చెప్పిన విధంగా చేసినప్పుడు మీరు ఏ విధమైన అనుభూతిని పొందారు?

[సత్య సాయి మానవతా విలువల విద్యా బోధన ఆధారంగా – చక్కని నడత మరియు భావోద్వేగ అక్షరాస్యత అభివృద్ధి కొరకు పాఠ్య ప్రణాళిక-కరోలే ఆల్డర్మాన్]