మానవతా విలువలు
మానవతా విలువలు
Sathya, Dharma, Shanthi, Prema & Ahimsa
- ధర్మ శాస్త్రాలు అనగా ఏమి?
 జ: మన ప్రవర్తనలను మార్గనిర్దేశం చేస్తూ, ఏది చేయవలెను, ఏది చేయకూడదు అని నైతిక విలువలు/నైతిక నియమావళిని తెలియజేయు శాస్త్రములను ధర్మ శాస్త్రములు అంటారు.
- మానవులకు ప్రధానమైన ఐదు జీవిత సూత్రములు ఏమిటి?
 జ: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ మరియు అహింస
- మనస్యేకం________ ,______________
 జ: వాచస్యేకం, కర్మణ్యేకం
- త్రికాల సత్యమనగా ఏమి?
 జ: త్రికాల సత్యము అనునది ఎన్నడూ మార్పు చెందనిది మరియు శాశ్వతమైన ఆత్మసాక్షాత్కారయుక్త పరమ చైతన్యం.
- పురుషార్ధములు అనగా ఏమి?
 జ: పురుషార్ధములనగా జీవిత లక్ష్యములు. అవి ధర్మ, అర్థ, కామ , మోక్ష
- మానవతా విలువలకు స్వామి ఇచ్చిన నిర్వచనం?
 జ:సత్యము:మనిషిలోని నిజతత్వమైన ఆత్మ స్వరూపమును తెలుసుకొనుటయే సత్యము. ఇదియే సత్యానికి పారమార్థికము. నైతిక కోణంలో సత్యము అనగా మాటలలో, చేతలలో, ఆలోచనలలో ఏకత్వము (వచస్యేకం, కర్మణ్యేకం, మనస్యేకం) ధర్మము:ఎల్లప్పుడూ క్రమశిక్షణతో సత్కర్మలను ఆచరించుటకు మానవ సంకల్పమును సూచించునది ధర్మము. మానవుని యొక్క అన్ని విధివిధానములను, నైతిక నియమములను తెలుపునది ధర్మము. శాంతి:స్వామి శాంతిని బోధిస్తూ, మానవ భావోద్వేగాల సంఘర్షణలను పరిష్కరించు దృక్పథమే శాంతి. కోరికలే మనస్సులో అలజడిని సృష్టించును మరల కోరికల నుండి విముక్తి పొందిన మనస్సు శాంతి స్థితికి చేరుకొనును. శాంతి యొక్క అత్యున్నత స్థితి (ప్రశాంతి) ఆనందము. ప్రేమ:ప్రేమ అనేది ఆత్మ యొక్క స్వరూపము. వికసించిన హృదయాన్ని విస్తారము చేయుచూ అందరి పట్ల ఆ ప్రేమను సహజంగా కురిపించుట. అహింస:అహింస అనేది ఆత్మ యొక్క సంపూర్ణ వికాసము, అద్వైత స్థితి, అన్నిటియందు ఉన్న ఉనికి యొక్క ఏకత్వం మరియు ఐక్యత, సర్వజీవుల యందు సమత్వము కలిగి ఉండుట. 
- ప్రేమపై మూడు సూక్తులను తెలపండి?
 జ: 1.ప్రేమ నిస్వార్థమైనది,
 2.ప్రేమ యొక్క తత్వము ఇచ్చుట మరియు క్షమించుట, స్వార్థం యొక్క తత్వము పొందుట మరియు మరచుట.
 3.అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు.
- క్రింది వాటిని సరిపోల్చండి
| 1. సత్యన్ | అ. ఇతి ధర్మః | 
|---|---|
| 2. ధారయతి | ఆ. పరమో ధర్మః | 
| 3. అహింసా | ఇ. నాస్తి పరో ధర్మః | 
జ: 1-ఇ, 2-అ, 3-ఆ
Adapted from Sri Sathya Sai Balvikas Quiz Bank, Group III by past Balvikas Students of Tamilnadu

 
                                