జోన్ ఆఫ్ ఆర్క్
జోన్ ఆఫ్ ఆర్క్
ఫ్రాన్సు దేశంలో లొరేన్ రాష్ట్రంలో ఒక మారుమూల గ్రామంలో జాక్స్ డి ఆర్క్ నివసిస్తూ ఉండేవాడు. ఆతని కుమార్తె జోన్ ఆఫ్ ఆర్క్. కథాకాలం నాటికి ఆమె వయస్సు 20 సంవత్సరాలు. చిన్నప్పటి నుండి ఒంటరిగానే కాలం గడిపింది. మానవ సంచారం ఎక్కువగా బీళ్ళల్లో గొరెలను కాచుకుంటూ కాలం గడిపేది. గంటల కొద్ది చీకట్లో కూర్చుని చర్చిలో ఏకాంతంగా ప్రార్థిస్తూ ఉండేది. ఏవో కొన్ని ఆకారాలతో తాను మాట్లాడినట్లు భావించేది. ఈమె మాటలు విని ఏవో కొన్ని దయ్యాలు వచ్చి ఈమెతో మాట్లాడుతున్నాయని ఆ గ్రామస్ధులు అనుకొనేవారు,
ఒకనాడు జోన్ తన తండ్రితో “నాన్నగారూ! నా ఒక వాణి వినిపించింది. వెళ్ళి డాఫిన్ కి సహాయం చేయమని చెప్పింది, కాబట్టి నేను వెళ్తాను”, చర్చిలో గంటలు కొట్టినపడల్లా ఈ వాణి వినిపించేదని చెప్పింది.
ఆమె తండ్రి ఈ మాటలు త్రోసిపుచ్చాడు. “జోన్ నేను చెప్తున్నాను విను. ఈ మాటలు లెక్క పెట్టవద్దు.మంచివాడికి ఇచ్చి పెళ్ళి చేస్తాను. అతని అండలో హాయిగా ఉండు” అని చెప్పాడు. కాని జోన్ లెక్క చేయలేదు. “నేను పెళ్ళి చేసుకోను. వెళ్ళి డాఫిన్కి సహాయం చేస్తాను” అని చెప్పింది.
ఒకనాడు ఒక బంధువును వెంట బెట్టుకొని ‘బెడ్రీ కోర్’ అనే ప్రభువుకోసం బయలు దేరింది. ఆయన డాఫిన్ వద్దకు తీసుకొని వెళ్తాడని విన్నది. చాలా రోజులు ప్రయాణం చేసి ఆ ప్రభువు వద్దకు చేరుకున్నారు. ఆయన జోన్ ను చూడడానికి మొదట నిరాకరించినా తర్వాత పిలిచి డాఫిన్ ఉండే చినాన్ పట్టణానికి పంపించాడు. ఆమెకు ఒక గుర్రం, కత్తి డాలు ఇచ్చి, ఇద్దరు, సేవకులను తోడు ఇచ్చి పంపించాడు. జోన్ కూడా పురుషుని దుస్తులు ధరించింది. ఒక గుర్రం ఎక్కి కత్తి డాలు ధరించి బయలు దేరింది. చినాన్ పట్టణం చేరి డాఫిన్ ను కలిసి “భగవంతుడు నాకు కనుపించి, మిమ్మల్ని రాజుగా చేసి శత్రు సంహారం చేయమన్నాడు” అని చెప్పింది. అతడు కొంతమంది పండితులను సంప్రదించాడు. వారు ఆమెకు ఏవో కొన్ని శక్తులు కనుపించి ఉండ వచ్చునని నిర్ధారించారు
అక్కడి నుండి జోన్ ఆర్లియన్సు చేరింది. కొంత సహాయంతో ఆర్లియన్సును ముట్టడించిన ఆంగ్లేయులను ఎదుర్కొంది. ఆమెను చూచి ఆర్లియన్సు ప్రజలు సంతో “మెయిడ్ ఆఫ్ ఆర్టియన్సు” వచ్చింది. మనలను రక్షిస్తుంది అని జయజయధ్వానాలు చేశారు. ఆమె సాహసాలకు ప్రజల ఆనందోత్సాహాలకు ఆంగ్లేయులు పారిపోయారు. ఇంకా అనేక ఆంగ్లేయుల్ని ఆమె ఓడించింది.
జోన్, డాఫిన్ ‘రైమ్సు’ నగరానికి వచ్చారు. అక్కడ పెద్ద చర్చిలో డాఫిన్ కిరీటం స్వీకరించి రైమ్సు కు రాజు అయ్యాడు. అప్పటినుండి ఆయన 7వ ఛార్లెసు అని పిలువబడ్డాడు.
అప్పుడు జోన్ ఆయన ముందు మోకరిల్లి “స్వామీ! నా విధి నేను నిర్వహించాను, తిరిగి మా వూరికి వెళ్ళిపోతాను సెలవియ్యండి” అని ప్రార్థించింది. కాని రాజు ఒప్పుకోలేదు, అక్కడే ఆమె సుఖంగా గడపడానికి ఏర్పాటు చేశాడు. జోన్ అక్కడే రాజుకు సహాయంగా ఉండిపోయింది. కాని ఆమె నిరాడంబర, నిస్స్వార్ధ, జీవితం గడిపింది.
చివరకు ఒక యుద్ధంలో ఆంగ్లేయుల చేతిలో మరణించింది. ఒక మండుతున్న నౌకలో ఆమె చిక్కుకుని కాలిపోయింది. కాని ఆమె ఫ్రెంచి ప్రజలకు అందించిన సందేశము, ఎన్నటికీ నిలిచి ఉంటుంది. ఆమె దేశభక్తి, విధినిర్వహణ
ఫ్రెంచి ప్రజలు ఎన్నడు మరువలేదు. క్రమక్రమంగా ఆంగ్లేయులను తరిమి వేసి స్వాతంత్య్రం పొందారు.
ప్రశ్నలు:
- జోన్ తాను విన్న వాణినుండి గ్రహించిన సందేశమేది?
- ఆమెను డాఫిన్ కు ఎవరు పంపారు?
- డాఫిన్ కు ఆమె చేసిన సహాయం ఏది?
- ఆమెకు మెయిడ్ అఫ్ ఆర్లెన్స్ అని ఎందుకు పేరొచ్చింది?
- జోన్ జీవితం ఎట్లు ఆదర్శవంత మయింది?