జూడో మతం

Print Friendly, PDF & Email
జూడో మతం

Sజూడో మతం (యూదు మతం) యూదు మతం యొక్క సహజ లక్షణాలు ఈ కింద ఇవ్వబడినాయి బైబిల్ లోని ప్రాచీన నిబంధనలు ఆడమ్ కథతో ప్రారంభమవుతాయి. మొదట్లో ఉన్నవాడు ఆడమ్ ఒక్కరే. మిగిలిన అందరూ ఆయన సంతతివారే. ప్రాచీన నిబంధనను అనుసరించి మనిషే మిగిలిన వారందరి సృష్టికి మూలం. నా తండ్రి నీ కన్నా గొప్పవాడు అనే సిద్ధాంతంతో మనుషులంతా ఒక్కటే.దేవుని దృష్టిలో అందరూ సమానమే అంటుంది. దేవుడు ఒక్కడే, ఆయనే సృష్టికర్త. ధర్మానికి మూలం.(monotheistic religion)

ఈజిప్ట్ దేశంలో ఫెరోజ్ అనే రాజు ఆధీనంలో జూడో మతం వారు నివసించేవారు. ఒకసారి మోజెస్ ఈజిప్టులోని సినోయ్ అనే పర్వత ప్రాంతానికి వెళ్లారు. అక్కడివారు అడవినంతా కాల్చడం చూశారు. దానినే బర్నింగ్ బుష్ అంటారు. దేవుని వాక్కు ఆయనకు వినిపించింది. పాలధారలు తేనె దారలతో ప్రవహించే లా ఆ పవిత్ర ప్రాంతమునకు నాయకత్వం వహించమని వాక్కు తెలిపింది.ఆయన దేవుని పేరు అడిగాడు నేనెవరో నేనే, అనే వాక్కు మరలా వినిపించింది. యూదులు అతి కష్టం మీద ఈజిప్ట్ వదిలి వెళ్ళారు.కొన్ని నెలల తర్వాత మళ్లీ సినోయ్ పర్వతానికి వెళ్ళారు. మోజెస్ కు మళ్లీ దేవుని వాక్కు వినిపించింది. దేవుడు రెండు పలకల మీద పది సూత్రాలు (నిబంధనలను) ఇచ్చాడు.అవే 10 ప్రాచీన నిబంధనలు.

ప్రాచీన నిబంధనలు:
  1. నేను ప్రభువును నీ దేవుడిని ఈజిప్ట్ నుంచి బానిసత్వం నుంచి నిన్ను బయటకు తీసుకొని వచ్చాను.
  2. నీవు వేరే దేవుని విగ్రహాన్ని చిత్రాలను పూజించ వద్దు. ప్రతిదీ స్వర్గం నుంచి వచ్చిందే చివరకు భూమి దానిపై ఉన్న జలం కూడా.
  3. దేవుని ప్రేమించే వారి మీద దయ చూపించు. ఆయన నిబంధనలను పాటించు.
  4. దేవునికి ఏ పేరు లేదు.
  5. వారంలో ఆరు రోజులు కష్టపడి పని చేయి. ఏడవ రోజు విశ్రాంతి.అది భగవంతుడి రోజు. ఆరోజు అందరికీ అన్నిటికీ విశ్రాంతి.
  6. తల్లిదండ్రులను గౌరవించు వారిని అనుసరించు, ఎక్కువ కాలం జీవిస్తావు.
  7. ఎవరిని చంపవద్దు.
  8. ఎవరిని మోసం చేయవద్దు.
  9. దొంగతనం చేయవద్దు.
  10. నీ పొరుగు వారి పై తప్పుడు సాక్ష్యం చెప్పరాదు. పొరుగువారి సంపదను కోర రాదు.

పది ప్రాచీన నిబంధనలతో తిరిగివచ్చిన మోజెస్, ప్రజలు యధా విధిగా విగ్రహారాధన చేయటం చూశాడు. విసిగి పోయాడు దేవుడిచ్చిన రెండు పథకాలను విసిరి వేసాడు.అవి పలిగి పోయాయి కానీ తర్వాత ప్రజలు తమ తప్పును తెలుసుకున్నారు.మోజెస్ ను వారు తిరిగి ఆ నిబంధనలను ఇవ్వమని కోరారు. దేవుని ప్రార్థించి వాటిని తిరిగి పొందాడు. వారినందరిని సంఘటిత పరచి ఎర్ర సముద్రాన్ని దాటి ఇజ్రాయిల్ లోకి ప్రవేశించాడు అక్కడే మోజెస్ తన ప్రాణాలు వదిలాడు. జోషువా అనే మోజెస్ శిష్యుడు వారిని ఇజ్రాయెల్ కు కొని పోయాడు. అదే వారి జన్మభూమి అయింది.

తర్వాత కాలంలో ట్రోరాహ్ జూడో నియమాలు సూత్రాలపై గ్రంథాన్ని రచించాడు.అనే టోల్ మడ్ గ్రంథంగా ప్రాచుర్యం పొందింది.

జోడోలు నమ్మే సిద్ధాంతాలు
  1. మెసయ్య దైవ అవతారం. (దైవత్వం గల మనిషి ప్రజలకు రక్షకుడుగా వచ్చారు).
  2. ఎవరైతే దేవుని అనుసరించి ఉంటారో వారిని దేవుడు ఎన్నుకుంటాడు
  3. ట్రోరాహ్ లోని సిద్ధాంతాలు

భగవంతుడే న్యాయనిర్ణేత అని వారు విశ్వసిస్తారు. ఎవరైతే దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తారో వారు శిక్షింప పడతారు. విగ్రహారాధన కూడదు వారి పవిత్ర క్షేత్రం సినాగోగ్
వారి మత పెద్దలను రబ్బీ అని పిలుస్తారు.భగవంతుడు నిరాకారుడు అనేది వారి విశ్వాసం.

జోడో మతం నమ్మే సూత్రాలు

  1. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము.
  2. మనసులో సైతం నీ సోదరుని ద్వేషించకు.

మత చిహ్నం నక్షత్రం. దీన్నే డేవిడ్ నక్షత్రము అని పిలుస్తారు. మండుతున్న పొదలు వారి మతానికి ప్రతీకలు ఇజ్రాయిల్ నుంచి వదిలి వచ్చిన సందర్భంగా ఎనిమిది రోజుల పాటు కొవ్వొత్తుల పండుగను నిర్వహిస్తారు అదే వారి నూతన సంవత్సరం హషనోవ్ అనే దీపాల పండుగ.