కళ్ళగంతల ఆట
కళ్ళగంతల ఆట
లక్ష్యం:
ఈ ఆట ఆటగాళ్లకు మంచి అనుభూతిని కలిగించే ఆట.
తన సహచరుని సహాయంతో ఒక గ్రుడ్డివాడు ఏ విధంగా తన లక్ష్యాన్ని చేరుకున్నాడు అనేది తెలియజేస్తుంది. ఈ ఆట పిల్లలలో ఒకరి పట్ల ఒకరికి నమ్మకం, దయ, వినికిడి శక్తి, సరైన భావ ప్రకటన సామర్థ్యం పెరగటానికి దోహదపడుతుంది.
ఆటలోని విలువలు:
- సహకారం
- నమ్మకం,
- సానుభూతి.
కావలసిన వస్తువులు:
- రెండు కళ్ళ గంతలు
- అడ్డుగా పెట్టడానికి బాక్సులు, “obstacles” కుర్చీలు, పుస్తకాలు, టేబుల్, బ్యాట్లు, ఫుట్ బాల్, బకెట్.
గురువులు ముందుగా తయారు చేసుకోవలసినవి ఏమీ లేవు.
ఎలా ఆడాలి
- గురువు ముందుగా పిల్లలను గ్రూపులుగా విభజించాలి.
- పైన చెప్పిన వస్తువులను హాల్ లో కానీ, బయటకాని అక్కడక్కడ పెట్టాలి.
- గ్రూపులో ఒకరికి కళ్లకు గంతలు కట్టి ఆట మొదలు పెట్టే లైన్ దగ్గర నిలబెట్టాలి.
- కళ్ళకు గంతలు కట్టుకున్న విద్యార్థికి వేరువేరు దిశల నుంచి పిలుస్తూ ఎలా వెళ్లాలో మార్గ నిర్దేశం చేయాలి. ఉదా: నేరుగా వెళ్ళు, ఎడమవైపు తిరుగు మొదలైనవి.
- రెండవ విద్యార్థి చెప్పిన దిక్కుల ఆధారంగా వెళ్తూ నిర్ణీత సమయంలో విజయం సాధించాలి.
- ఇది రెండవ సమూహంలోని ఇద్దరు ఆటగాళ్లచే పునరావృతం అవుతుంది.
- చివరిగా నిర్ణీత సమయ వ్యవధిలో గమ్యస్థానాన్ని చేరుకోగలిగిన వారు విజేత.
గురువులకు చిట్కాలు:
- గైడ్ మరియు కళ్ళకు గంతులు కట్టిన పిల్లల పాత్రలు మారవచ్చు.
- ఇది కళ్లకు గంతలు కట్టుకున్నవ్యక్తిగా, మార్గదర్శిగా రెండు పాత్రలలోను వారి అనుభవాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది
- చూడలేనప్పుడు నిస్సహాయత, అభద్రత నిరాశ మొదలైనవి మరియు తర్వాత అవి గైడ్ గా ఉన్నప్పుడు స్పష్టమైన మార్గదర్శకత్వం లభించినప్పుడు ఆశ నమ్మకం, ఆత్మవిశ్వాసం, కృతజ్ఞత, సంకల్పం మొదలైన అనుభవాలను అనుభవిస్తారు.
- ఒక మార్గదర్శిగా అతని భావాలు సానుభూతి కరుణ, శ్రద్ధ, స్వీయ సంతృప్తి మరియు అంతర్గత ఆనందానికి దారి తీస్తుంది.