మాయా జాడి
మాయా జాడి
లక్ష్యం:
ఈ ఆట యొక్క ప్రాధాన్యత సమయ నిర్వహణకు సంబంధించినది, పిల్లలకు విషయాల పట్ల అవగాహన కలిగించే ఒక తెలివైన కార్యక్రమం.
ఈ ఆటలోని విలువలు:
- అన్ని వివరాలు తెలుసుకోవాలనే ఉత్సుకత
- వివక్ష
- నిర్ణయం తీసుకోవడం
- సహకారం
కావలసిన వస్తువులు:
- ఒకే పరిమాణం లో ఉన్న రెండు పాత్రలు/కూజాలు
- గోళీలు, గులకరాళ్లు, కంకర, ఇసుక/మట్టి, నీరు
- (ప్రత్యేక కప్పులలో ప్రతి ఒక్కటి సమాన పరిమాణంలో)
గురువు తయారు చేయవలసినది:
ఏమీ లేదు.
ఎలా ఆడాలి
- గురువు పిల్లలను రెండు గ్రూపులుగా విభజిస్తారు.
- ప్రతి గ్రూపు కొన్ని గులకరాళ్లు, కంకర, ఇసుక మరియు నీటితోపాటు ఒకే రకమైన కూజా తీసుకుంటారు.
- వీలైనంత తక్కువ సమయంలో కూజాలో ప్రతిదీ అమర్చడం ఒక సవాలు.
- ఈ పని ముందుగా పూర్తి చేసిన వారు విజేతలు.
గురువులకు చిట్కాలు:
- ప్రతి గ్రూపు కూజాని నింపిన తర్వాత వారు ఆడిన విధానం గురించి వారితో చర్చించవచ్చు.ఎలా అంటే
- మీకు ఇచ్చిన వస్తువులను కూజాలో ఏ విధంగా పెట్టాలని అనుకున్నారు లేదా నిర్ణయించారు?
- ఇలానే పెట్టాలని అనుకోవడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? లేదా వారు యాదృచ్ఛికంగా ప్రతిదీ చేశారా?
- అలా అయితే వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి?
- గెలిచిన గ్రూపు స్పష్టంగా గులకరాళ్ళతో మొదలుపెట్టి కంకరతో ఆపై ఇసుకతో మరియు నీటితో ముగించారు అంటే సరైన క్రమంలో నిర్వహించారు అని పిల్లలు గ్రహిస్తారు. విజయం సాధిస్తారు అని వారికి అర్థమవుతుంది.
- గురువు పిల్లలు ప్రతిరోజు చేయవలసిన పనులను ప్రణాళికా బద్ధంగా నిర్వహించవలసిన అవసరాన్ని బోధించడానికి ఈ ఆటాడిస్తారు.
- చేయవలసిన పనులలో అతి ముఖ్యమైన, క్లిష్టమైన పనులనుముందుగా పూర్తిచేసి ఆ తర్వాత అవసరమైన లేదా తక్కువ ఒత్తిడితో కూడిన పనిని పూర్తి చేయడం ద్వారా అంత ముఖ్యం కాని పనులను తరువాత పూర్తి చేయడం ద్వారా ఏది ముందు ఏది తర్వాత చేయాలి అనే వివేకం కలుగుతుంది.
- ఇది జీవితంలో ప్రతిదానికి వర్తిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
- విజయం సాధించడంలోఇది బాగా ఉపయోగపడుతుంది. ఒక సమర్థవంతమైన ప్రణాళికను క్రమశిక్షణతో సరైన సమయంలో చేయడంతో పాటు సమయపాలన కూడా నేర్పించే పాఠం ఇది. బాబా చెప్పిన “కాలం వృధా చేస్తే జీవితం వ్యర్థం అవుతుంది” ని నేర్పించడానికి ఇది ఒక మంచి పాఠం.