శాస్త్రజ్ఞానము – మానవత

Print Friendly, PDF & Email
శాస్త్రజ్ఞానము – మానవత

‘డేవీస్ సేఫ్టీ లాంప్’ (Davy’s Safety lamp) అనే కరదీపికను కనిపెట్టిన శాస్త్రజ్ఞుడు ‘సర్ హంఫ్రీడేవి’. ఈ దీపం కనిపెట్టకముందు బొగ్గు గనుల్లో పనిచేసే వేలాదిమంది కార్మికులు అగ్ని ప్రమాదాలకు లోనవుతూ ఉండేవారు. బొగ్గు గనుల్లో ఉత్పన్నం అయిన వాయువు సులభంగా మండి ప్రాణ నష్టాలు కలిగిస్తూ ఉండేది. సాధారణంగా ఉపయోగించే కరదీపికలు ఈ అగ్నిజ్వాలలకు నిలవలేక పోయాయి. హంఫ్రీడేలీ చాలా సంవత్సరాలు కష్టపడి పరిశోధించి సులభంగా నిప్పు అంటుకోని దీపం కనిపెట్టాడు. అది గనుల్లో పనిచేసేవారికి వరప్రసాదం అయింది.
Davy's Inventionతలచుకుంటే హంఫ్రీ తను కనిపెట్టిన దాని సర్వహక్కులు తనవద్ద ఉంచుకొని లక్షలు గడించేవాడు. కాని ఆయన దానికి అంగీకరించక సర్వహక్కులు వదలుకున్నాడు. ఎవరైనా దానిని వినియోగించుకోవచ్చు అన్నాడు.

అతని స్నేహితుడొకడు ఒకసారి హంఫ్రీతో “ఈ హక్కును నీవు ఉంచుకుంటే ఎంత డబ్బు చేసుకోగలవో ఊహించుకో” అన్నాడు. కాని హంఫ్రీ “మిత్రమా! నాకు అటువంటి ఆలోచన లేదు. నా పరమార్ధం మానవ సేవయే. ధనం మానవునికిచ్చే సుఖం ఎటువంటిదో, కీర్తి ఎటువంటిదో నాకు తెలియక కాదు. నాకు ఉన్నది చాలు” అని ఆ సూచనను తిరస్కరించాడు.

ఇటువంటి మహనీయుడు సర్ హంఫ్రీడేవి (Davy) గొప్ప శాస్త్రవేత్తగా మానవతా వాదిగా శాశ్వత కీర్తి సంపాదించాడు.

ప్రశ్నలు:
  1. హంఫ్రీదేవీ కనుగొన్నదేది?
  2. గనులలో పనిచేసేవారికి పరప్రసాడం ఎందుకయింది?
  3. హంఫ్రీడేవి గొప్ప మానవతావాది అని ఎట్లు చెప్పుగలవు?
  4. హంప్రి డేవి కి మిత్రుని సలహా ఏమి? దానికి హంప్రి డేవి సమాధానం ఏమి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *