మంచిని చూడండి
మంచిని చూడండి
లక్ష్యం:
ఈ కార్యాచరణ మన భగవాన్ ఎప్పటినుంచో నొక్కి చెప్పినట్లు, పిల్లలను ఇతరులలో మంచిని చూసేలా చేయడం మరియు ఇతరులను విమర్శించడంలో మునిగిపోకుండా చూడటం లక్ష్యంగా పెట్టుకుంది.
సంబంధిత విలువలు:
- ప్రేమ
- ప్రశంస
అవసరమైన పదార్థాలు:
- పిల్లల పేర్లు కలిగిన కాగితపు స్లిప్పులు
- ఒక గిన్నె
- సంగీతం / భజన
గురువు కోసం సన్నాహక పని:
ఏదీ లేదు
ఎలా ఆడాలి
- గురువు పిల్లలను గుండ్రముగా కూర్చోమని చెప్పాలి.
- ఆమె అన్ని స్లిప్‌లను ఒక గిన్నెలో ఉంచి, ఒక పిల్లవాడికి ఇచ్చి, మరియు ఆ గిన్నెను ఒకరి తరువాత ఒకరు తదుపరి పిల్లవాడికి అందచేసేలా చూడాలి.
- సంగీతం/భజన అంతటా ప్లే చేయబడుతుంది.
- సంగీతం/భజన ఆగిపోయినప్పుడు, ఆ సమయంలో గిన్నెని కలిగి ఉన్న పిల్లవాడు దాని నుండి ఒక స్లిప్‌ని ఎంచుకొని పేరును చదువుతాడు, ఉదా. ఉమా.
- ఇప్పుడు స్లిప్ ఉన్న పిల్లవాడు ఉమలో ఒక మంచి లక్షణమును చెప్పాలి (ఉదాహరణ: కేరింగ్/సంరక్షణ).
- ఇప్పుడు ‘ఉమ’ అనే పేరు ఉన్న స్లిప్ తీసివేసి గిన్నెను మళ్లీ సంగీతాన్ని/ భజనను ప్లే చేస్తూ ఒకరి నుండి ఒకరికి అందచేసేలా చూడాలి.
- అన్ని పేర్లు అయిపోయే వరకు మరియు ప్రతి పిల్లవాడికి అవకాశం వచ్చే వరకు ఆట ఈ పద్ధతిలో కొనసాగుతుంది.
- ఒక పిల్లవాడు తన స్వంత పేరును ఎంచుకుంటే, అతను తన చెడు అలవాటును చెప్పవలసి ఉంటుంది (ఉదాహరణ: కోపం)
గురువులకు చిట్కాలు:
స్వామి చెప్పినట్లు మన నాలుకతో ఇతరులను విమర్శించే పాపము బదులు, ఒకరి స్వంత చెడు లక్షణాలు మరియు అలవాట్లను వదిలించుకోవడానికి ప్రయత్నించడం ఇతరుల మంచి లక్షణాలు మరియు అలవాట్లపై దృష్టి పెట్టడం మరియు అనుకరించడం ఎంత ముఖ్యమో తరగతి లో చర్చించాలి.