మంచిని చూడండి

Print Friendly, PDF & Email
మంచిని చూడండి
లక్ష్యం:

ఈ కార్యాచరణ మన భగవాన్ ఎప్పటినుంచో నొక్కి చెప్పినట్లు, పిల్లలను ఇతరులలో మంచిని చూసేలా చేయడం మరియు ఇతరులను విమర్శించడంలో మునిగిపోకుండా చూడటం లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత విలువలు:
  • ప్రేమ
  • ప్రశంస
అవసరమైన పదార్థాలు:
  1. పిల్లల పేర్లు కలిగిన కాగితపు స్లిప్పులు
  2. ఒక గిన్నె
  3. సంగీతం / భజన
గురువు కోసం సన్నాహక పని:

ఏదీ లేదు

ఎలా ఆడాలి
  1. గురువు పిల్లలను గుండ్రముగా కూర్చోమని చెప్పాలి.
  2. ఆమె అన్ని స్లిప్‌లను ఒక గిన్నెలో ఉంచి, ఒక పిల్లవాడికి ఇచ్చి, మరియు ఆ గిన్నెను ఒకరి తరువాత ఒకరు తదుపరి పిల్లవాడికి అందచేసేలా చూడాలి.
  3. సంగీతం/భజన అంతటా ప్లే చేయబడుతుంది.
  4. సంగీతం/భజన ఆగిపోయినప్పుడు, ఆ సమయంలో గిన్నెని కలిగి ఉన్న పిల్లవాడు దాని నుండి ఒక స్లిప్‌ని ఎంచుకొని పేరును చదువుతాడు, ఉదా. ఉమా.
  5. ఇప్పుడు స్లిప్ ఉన్న పిల్లవాడు ఉమలో ఒక మంచి లక్షణమును చెప్పాలి (ఉదాహరణ: కేరింగ్/సంరక్షణ).
  6. ఇప్పుడు ‘ఉమ’ అనే పేరు ఉన్న స్లిప్ తీసివేసి గిన్నెను మళ్లీ సంగీతాన్ని/ భజనను ప్లే చేస్తూ ఒకరి నుండి ఒకరికి అందచేసేలా చూడాలి.
  7. అన్ని పేర్లు అయిపోయే వరకు మరియు ప్రతి పిల్లవాడికి అవకాశం వచ్చే వరకు ఆట ఈ పద్ధతిలో కొనసాగుతుంది.
  8. ఒక పిల్లవాడు తన స్వంత పేరును ఎంచుకుంటే, అతను తన చెడు అలవాటును చెప్పవలసి ఉంటుంది (ఉదాహరణ: కోపం)
గురువులకు చిట్కాలు:

స్వామి చెప్పినట్లు మన నాలుకతో ఇతరులను విమర్శించే పాపము బదులు, ఒకరి స్వంత చెడు లక్షణాలు మరియు అలవాట్లను వదిలించుకోవడానికి ప్రయత్నించడం ఇతరుల మంచి లక్షణాలు మరియు అలవాట్లపై దృష్టి పెట్టడం మరియు అనుకరించడం ఎంత ముఖ్యమో తరగతి లో చర్చించాలి.