నిశ్శబ్దం అంటే సాయి – లెన్స్
నిశ్శబ్దం అంటే సాయి – లెన్స్
లక్ష్యం:
ఈ కార్యాచరణ పిల్లల మానసిక బలాన్ని పెంపొందించడమే కాకుండా ఎలాంటి అవాంతర పరిస్థితుల్లోనూ ప్రశాంతతను కోల్పోకుండా చేస్తుంది.
సంబంధిత విలువలు:
- స్వయం నియంత్రణ
- సహనం
- శాంతి
- నిశ్శబ్దం
అవసరమైన పదార్థాలు:
ఏదీ లేదు
గురువు కోసం సన్నాహక పని:
ఏదీ లేదు
ఎలా ఆడాలి
- గురువు తరగతిని రెండు గ్రూపులుగా విభజిస్తారు.
- గ్రూప్ A నుండి ఒక పిల్లవాడు ఎదురుగా వచ్చి నిశ్శబ్దంగా కూర్చుంటాడు.
- తర్వాత, గ్రూప్ B కి చెందిన పిల్లలు ఆ పిల్లవాడిని తాకకుండా వివిధ మార్గాల్లో (జోక్స్, ఫన్నీ చర్యలు మొదలైనవి) నిశ్శబ్దంగా కూర్చున్న పిల్లవాడిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాలి.
- వారి చిలిపి చేష్టలతో కలవరపడకుండా,అతను చివరి వరకు మౌనంగా ఉండగలిగితే, అతను తన గ్రూప్‌కు ఒక పాయింట్ సాధిస్తాడు మరియు మళ్ళీ అతని స్థానంలో ఒక అబ్బాయి వచ్చి కూర్చుంటాడు.
- కానీ, అతను చిలిపి చేష్టలతో కలవరపడి, మధ్యలో మౌనాన్ని విడిచిపెడితే, అతను ఆటలో అవుట్ మరియు గ్రూప్ B కు పాయింట్ వస్తుంది.
- ఇప్పుడు B గ్రూప్ నుండి ఒక అబ్బాయి వచ్చి ఎదురుగా కూర్చుంటాడు మరియు A గ్రూప్ నుండి పిల్లలు అతన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తారు.
- గేమ్ ఈ పద్ధతిలో కొనసాగుతుంది మరియు గరిష్ట పాయింట్లు సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది!!