శబ్దము-చప్పట్లు
శబ్దము-చప్పట్లు
ప్రియమైన పిల్లలూ!
చేతులు పైకి, క్రిందకూ చాచండి. శ్వాస తీసుకొని వొదలండి.
చేతులతో చప్పట్లు కొట్టండి… నెమ్మదిగా… వేగంగా… చేతులు కట్టుకోండి. నమస్కారం పెడుతూ ప్రార్ధన చెయ్యండి.
మీ చేతులను చిన్ ముద్ర లో ఉంచండి. కళ్ళు మూసుకోండి.భగవంతుడు మనకు అద్భుతమైన రెండు చేతులను ప్రార్ధన చేయుటకు, భగవంతుని కొరకు పని చేయుటకు ఇచ్చాడు. మనం ఎలా ప్రార్థిస్తాం? ప్రార్ధన అంటే చేతులను జోడించుట మాత్రమే కాదు.పెద్దలను గౌరవించడం ద్వారా, ప్రకృతిని పరిరక్షించుట ద్వారా, మన పనిని మనం చేసుకుంటూ ఇతరులకు సహాయపడటం ద్వారా మనం ప్రార్ధన చేస్తాము.
మనం భగవంతుని పని ఎలా చేస్తాము? మనం మన పనిని సంతోషంగా చేసినప్పుడు, భగవంతునికి నివేదించినట్లే.. ఎవరి పని వారు చేసుకోవడం కూడా ధర్మమే అంటారు. ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న” అంటారు మన స్వామి.
సాయీ…అంటూ భజన చేయడం ద్వారా భగవంతుని సంతోష పెడుతూ ఆయనను చేరుదాం. మెల్లగా కళ్ళను తెరవండి. చేతులను మామూలు గా ఉంచండి.
ప్రశ్నలు:
- ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న”. వివరించండి.
- నీవు ఇతరులకు ఎలాంటి సాయం చేశావు?