త్రిగుణాలు

Print Friendly, PDF & Email
త్రిగుణాలు
లక్ష్యం:

పిల్లలు సత్వ,తమో,రజో గుణాలలోని సత్వగుణాన్ని అభ్యసించే ఆహ్లాదకరమైన ఆట ఇది.

ఈ ఆటలోని విలువలు:
  • ఏకాగ్రత
  • వివక్ష
  • ఐక్యత-బంధం
కావలసిన వస్తువులు:

మూడు రకాల పప్పులు కాబూలీ శనగలు, సత్వ మినుములు,తమో, రాజ్ మా/కిడ్నీ బీన్స్ రజో

పప్పులను ఉంచడానికి 3 గిన్నెలు/ప్లేట్లు

గురువు ముందుగా తయారుచేయవలసిన పని:

ఏదీ లేదు.

ఎలా ఆడాలి?
  1. గురువు పిల్లలను చిన్నచిన్న గ్రూపులుగా విభజిస్తారు.
  2. ప్రతి గ్రూప్ కు మూడు పప్పుల మిశ్రమం ఇవ్వబడుతుంది.
  3. గ్రూపులోని పిల్లలు మూడు త్రిగుణాలను సూచించే మూడు పప్పులను వీలైనంత త్వరగా వేరు చేయాలి.
  4. ముందుగా ఏ గ్రూపు వారు వేరు చేయగలరో ఆ గ్రూపుని విజేతగా ప్రకటిస్తారు.
గురువులకు చిట్కాలు:
  • ఇది ఆడించిన తర్వాత తరగతిలో చర్చించే విషయం పిల్లలపై చక్కని ప్రభావం చూపుతుంది. అవి
  • రావణుడు, విభీషణుడు, కుంభకర్ణులు ముగ్గురూ మూడు గుణాలకు ఉదాహరణలు. వరుసగా రజో, సత్వ, తమో.
  • సత్యం,భక్తి మొదలైన
  • సాత్విక లక్షణాలను అలవర్చుకోవాల్సిన అవసరం,
  • అలాగే ప్రతి బృందం తమకు ఇచ్చిన పనిని ఎలా విభజించుకోవాలో, అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మొదలైనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *