21వ శతాబ్దపు వేదం
21వ శతాబ్దపు వేదం
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని యుగవతారిగా గుర్తించి, ఆయన సందేశాన్ని- ఆధ్యాత్మిక చింతన మరియు సాధన యొక్క అంతిమ సంశ్లేషణగా పరిగణించి , మానవాళికి ఈ సందేశాన్ని స్పష్టీకరించడానికి, తెలియజెప్పే వెలసిన బాధ్యత, శ్రీ సత్యసాయి సేవా సంస్థలపై ఉంది. లక్షలాది యత్న ప్రయత్నాల అనంతరం, వేలాది నాగరికతలు మరియు రాజకీయ తత్వాల వృద్ధి మరియు క్షీణత, ఆధ్యాత్మికత మరియు మానవ ఉనికికి సంబంధించిన ఒక పొందికైన అవగాహనతో ప్రాచీన జ్ఞానం మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని ఏకీకృతం చేసే అవకాశం ఇప్పుడు మనకు తొలిసారిగా లభించింది.
తమ దివ్య ప్రణాళికలో భాగంగా బాబా వారు, తమ అనంతమైన జ్ఞానంతో, బాల్ వికాస్ గురువుల ద్వారా ఈ సందేశాన్ని తెలియజేయడానికి బాల్ వికాస్ పిల్లలను శ్రద్ధగా ఎంచుకున్నారు. గత ముప్పై సంవత్సరాలుగా, బాల్ వికాస్ గురువులు భగవాన్ బాబా పట్ల ఎంతో భక్తి మరియు విశ్వాసంతో శ్రీ సత్యసాయి బాల వికాస్ పాఠ్యాంశాలను అమలు చేస్తున్నారు. ఈ కోర్సును అభ్యసించిన పిల్లలు వారి వారి దేశాలలో మంచి పౌరులుగా మారడం మనము చూస్తున్నాము: గురువులు కూడా తరగతులను నిర్వహించడంలో అపారమైన ఆనందాన్ని పొందారు. అయితే, ఈ మంచి ఫలితాలు ఎందుకు, ఎలా పొందబడ్డాయోనని మనం గమనిస్తే, బోధనా పద్దతి చాలా ప్రోత్సాహకరంగా ఉండి పిల్లల ప్రవర్తనలో పరివర్తనకు దారితీసింది. ఇది ఎలా జరుగుతుంది అని ఎవరైనా అడిగితే, మన సమాధానం ‘ఆయన దివ్య కృప’ లేదా ‘బాబా వారి ఆశీస్సులు’.
భగవాన్ బాబా వారి ఎడ్యుకేర్ సందేశం యొక్క అంతర్గత ప్రాధాన్యతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసర ఉందని భావించాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. వారు వెల్లడించిన ఈ విషయం, మనం ఆనందంగా మరియు శాంతితో జీవించడానికి సహకరిస్తుంది.
‘విద్యకు రెండు కోణాలున్నాయి; మొదటిది బాహ్య మరియు ప్రాపంచిక విద్యకు సంబంధించినది, ఇది పుస్తక జ్ఞానాన్ని పొందడం తప్ప మరొకటి కాదు. ఆధునిక ప్రపంచంలో, ఈ అంశంలో చాలా మంది బాగా ప్రావీణ్యం పొందినవారు మరియు అధిక అర్హతలు ఉన్నవారు ఉన్నారు. ఎడ్యుకేర్ అని పిలువబడే రెండవ అంశం మానవతా విలువలకు సంబంధించినది. ఎడ్యుకేర్ అనే పదానికి అర్థం – లోపల ఉన్న దానిని బయటకు తీసుకురావడం. ప్రతి మనిషిలోనూ మానవతా విలువలు దాగి ఉంటాయి; వాటిని బయటి నుండి పొందలేరు. వాటిని లోపల నుండి వెలికితీయాలి. ఎడ్యుకేర్ అంటే మానవతా విలువలను బయటకు తీసుకురావడమే. ‘బయటకు తీసుకురావడం’ ‘అంటే వాటిని ఆచరించడమే.’
-శ్రీ సత్యసాయి (25 సెప్టెంబర్ 2000)
ఎడ్యుకేర్ అనేది మన ప్రియతమ భగవాన్ బాబా వారు, వారి ప్రత్యక్ష బోధనలు, ఉపన్యాసాలు మరియు సహజమైన అనుభవాల ద్వారా మనకు వెల్లడించిన జీవిత సత్యం. ఇది భౌగోళికానికి , చరిత్రకు కొత్త అర్థాన్ని, భాషకు కొత్త జీవశక్తిని, సైన్స్- గణితానికి విశ్వ అవగాహనను మరియు సంగీతం మొదలగు కళలకు శోభనిస్తుంది. ఇది ప్రతి వ్యక్తిలో అంతర్గత అంతర్ దృష్టి మరియు సృజనాత్మకతల వెల్లువ. ఇది మన హృదయాలలో ఒక దివ్య కమలమై వికసిస్తుంది. ఇది మనల్నిసంగ్రహన స్థితి నుండి సంవర్ధక మరియు సంవాహన మూర్తులుగా తయారు చేస్తుంది.
ఈ సందేశం సృష్టిలోని అతి చిన్న పరమాణువును నుండి విశ్వంలోని అతి పెద్ద గెలాక్సీ వరకు చుట్టి వుంది. ఇది దేశ, కాల పరిమితులను అధిగమించి, భగవాన్ బాబా వారు భౌతిక శారీరకంతో ఉన్నపుడు వ్యక్తిగతంగా వారితో సంభాషించే అర్హత లేని వారికి మరియు భవిష్యత్తులో బాబా వారు భౌతిక శరీరంతో అందుబాటులో లేని సమయంలో కూడా వర్తిస్తుంది.
విశ్వ మానవ సమాజంలోని వివిధ రంగాల్లో సాయి బోధనలను భిన్న కోణాల్లో ఉపయోగించడం వలన, విద్య అనే పదం యొక్క సాంప్రదాయ పరిధిని మించిపోయాయి. అందువల్ల, భగవాన్ బాబా తరచుగా ఉల్లేఖించిన పదం, ‘ఎడ్యుకేర్’ అనేది అభ్యాసం మరియు మానవ అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలను చేర్చడానికి ఒక ప్రత్యేక విధానంగా స్వీకరించబడింది. ఈ సందేశం మానవజాతి అందరికీ సంబంధించినది మరియు సర్వత్రా వర్తిస్తుంది.
నా కర్తవ్యం, మానవులు వ్యక్తిగత దుఃఖాన్ని నయం చేయడం, ఓదార్చడం మరియు తొలగించడం మాత్రమే కాకుండా మరోక చాలా ముఖ్యమైన విషయం ఉంది. దుఃఖం మరియు బాధల తొలగింపు అనేవి నా అవతారం కార్యక్రమంలో ప్రాధాన్యత లేకుండా సంభవించేవి. ప్రజలందరి హృదయాలలో వేదాలు మరియు శాస్త్రాలను పునఃస్థాపించడమే నా ప్రధాన కర్తవ్యం.
– శ్రీ సత్యసాయి (నవంబర్ 26, 1964)
ఈ దివ్యప్రకటన అద్వితీయమైనది; నిజంగా, ఎడ్యుకేర్ అనేది 21వ శతాబ్దపు వేదం. మానవజాతి చరిత్రలో మొట్టమొదటిసారిగా, ఒక అవతారము, జ్ఞానాన్ని మరియు ఆచరణను, సరళీకృత పద్ధతిలో సంశ్లేషణ చేసింది, సిద్ధాంతాలు మరియు ఆరాధనల వెనుక ఉన్న అపోహలను బద్దలు కొట్టింది మరియు మనల్ని కుల, వర్ణ, మతం లేదా మతాలకు అతీతంగా తీసుకువెళ్లింది. ‘భగవంతుడు మాత్రమే సరళుడు, మిగిలినవన్నీ సంక్లిష్టమైనవి,’ అని బాబా వారు చెప్పారు. మరియు, తన అనంతమైన దయ మరియు కరుణతో, భగవాన్ బాబా వారు, కోట్లాది మంది భక్తుల పిలుపు మరియు వారి కోరికలకు ప్రతిస్పందిస్తూ, అవ్యక్తము (నిరాకర్) నుండి వ్యక్తమయ్యారు, తద్వారా వారి జీవితమే వారి సందేశాన్ని తెలియజేస్తుంది.
- The concept of Sri Sathya Sai Educare is Spiritual, Universal and Global.
- Divinity is the source and foundation of all existence.
- Values are latent; they are not to be taught but manifested.
- Educare is for life, not merely for a living.