పర్యాయపదం రౌండ్ – చంద్రుడు
పర్యాయపదం రౌండ్- చంద్రుడు
మన దేశంలో సూర్యుడు మరియు చంద్రుడు వీరిరువురిని ఆరాధ్య దేవతలుగా పూజిస్తూ పండుగలు జరుపుకుంటాము. "చంద్రమా మనసో జాత:" అనేది వేద వాక్కు. చంద్రుడు మన మనస్సుని నియంత్రించే దేవత. మన మనస్సు మరియు బుద్ధి మీద చంద్రుని ప్రభావం ఉంటుంది. ఇది గుర్తించడానికే మనం ఈ దేవతల పేరుమీదుగా పండగలు జరుపుకుంటాము.
ప్రమాణం: ప్రతి బృందం “చంద్రుడు” అనే పదానికి పర్యాయపదంగా ఉండే భజనని పాడాలి.
ఈ రౌండ్ను ఇలా నిర్వహించాలి: ఆటను నిర్వహించే వ్యక్తి “చంద్రుడు” పదానికి పర్యాయపదాలు రాసి చిట్ పంపిణీ చేస్తారు మరియు ప్రతి బృందం ఒక చిట్ని ఎంచుకుని, చిట్ లో కనిపించే పదాన్ని కలిగి ఉన్న భజనను పాడతారు
- తయారీ సమయం: 10 సెకండ్స్
- ఈ రౌండ్ పాయింట్లు: 10
- ప్రశ్నలు పాస్ చేయబడవు
Sl.no. | Bhajan | Synonyms of Moon |
---|---|---|
1. | ఇందు శేఖర శంభో శివ | ఇందు |
2. | చన్ద్రశేఖరాయ నమః ఓం | చంద్ర |
3. | బ్రహ్మాండ నాయక బాబా | చాంద్ |
4. | సుందర వాదని సుగుణ మనోహరి | శశి |
5. | స్పర్శన లింగం ఉద్భవ లింగం | సోమ |
[Adapted from : Sai Bhajan Anthakshari, A Spiritual game for Sadhana Camps, retreats and Bal Vikas Students by Smt.Nalini Padmanaban]