గురుబ్రహ్మ

ఆడియో
పంక్తులు
- గురుబ్రహ్మ గురుర్విష్ణుః
 - గురుర్దేవో మహేశ్వరః
 - గురుస్సాక్షాత్ పరబ్రహ్మ
 - తస్మై శ్రీ గురవే నమః
 
అర్ధము
గురువే బ్రహ్మ. గురువే విష్ణువు. గురువే మహేశ్వరుడు (శివుడు). గురువు సాక్షాత్ పరబ్రహ్మమే. అట్టి గురువునకు నమస్కారము.
వివరణ
వివరణ
| గురుబ్రహ్మ శ్లోకము | వివరణ | 
|---|---|
| గురు | ఉపాధ్యాయుడు / తన అనుభవంతో సత్యాన్ని తెలుసుకుని దానిని తన దినచర్యలో భాగంగా ఆచరించువాడు. | 
| బ్రహ్మ | సృష్టికర్త / గురువు బ్రహ్మ దేముడితో సమానము. ఎందుకనగా గురువు తన శిష్యులకు మంచి ఆలోచనలు కలుగుటకు, మంచి నడవడిక కలిగి ఉండుటకు సహాయపడును. | 
| విష్ణు | స్థితికారుడు / గురువు విష్ణువుతో సమానము. ఎందుకనగా గురువు తన శిష్యులలోని మంచి లక్షణములను ఎల్లప్పుడూ కాపాడును. | 
| గురుర్దేవో మహేశ్వరః | గురువు సాక్షాత్తు ఆ శివ స్వరూపమే. ఎందుకనగా ఆయన తన శిష్యులలో ఉన్న చెడు లక్షణములను, చెడు భావనలను తొలగించును. | 
| గురుస్సాక్షాత్ పరబ్రహ్మ | ఆ త్రిమూర్తుల శక్తులు కలిగి ఉన్న గురువు, ఆ ముగ్గురి కన్నా గొప్పవాడు. | 
| తస్మై శ్రీ గురవే నమః | అట్టి గురువునకు నమస్కారము | 
Overview
- Be the first student
 - Language: English
 - Duration: 10 weeks
 - Skill level: Any level
 - Lectures: 4
 
- 
	
	
చేయవలసినవి
 - 
	
	
మరింత చదవడానికి
 

                                



