మనోజవం శ్లోకము – ఆక్టివిటీ
లక్ష్యం – భగవంతుని నామస్మరణ ప్రాముఖ్యత మరియు నామాన్ని స్మరించటం వల్ల కష్టమైన పనులు సులువుగా సాధించవచ్చని గ్రూప్-1 పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పడం. అంతేకాకుండా నామస్మరణ మనల్ని అన్ని విధాలా కాపాడుతుందని తెలియపరచడం.
అవసరమైన వస్తువులు – పూసలు, పూసలని చుట్టడానికి ఒక తీగ, కత్తెర
జపమాల తయారు చేసే ఆక్టివిటీ
హనుమంతుడు రామ నామం తో అతి కష్టమైన పనులను ఎలా సాధించాడో గురువులు పిల్లలకు చెప్పాలి. భగవంతుని నామస్మరణ చేస్తూ ఏదైనా పని చేస్తే, ఆ పనికి కావలసిన ధైర్యం, పట్టుదల మరియు తెలివితేటలు భగవంతుడు మనకి ప్రసాదించి ఆత్మవిశ్వాసంతో ఆ పనిని పూర్తి చెయ్యడానికి సహకరిస్తాడని పిల్లలకు తెలియపరచాలి.
- మొదట ప్రతి విద్యార్థికి 27 పూసలు (అందులో 26 సాధారణ పూసలు మరియు రంగులో కాని లేదా పరిమాణంలో కానీ వేరేగా కనబడే ఒక గురుపూస ఉండేట్లు చూసుకోండి) మరియు ఒక తీగ ఇవ్వండి.
- చదునుగా మరియు శుభ్రంగా ఉన్న స్థలంలో ఆ 27 పూసలను పెట్టమని చెప్పండి.
- తీగ చివర ముడి వేశాక విద్యార్థులను ఒక్కొక్క పూస తీసుకుని అ తీగకి జోడించమని చెప్పండి.
- ప్రతి పూస జోడించే సమయంలో జైశ్రీరామ్ మంత్రమును జపించాలి.
- విద్యార్థులు 26 పూసలు జోడించిన తరువాత, గురు పూస జోడించడానికి మరియు కుచ్చు వేయడానికి గురువులు సహాయం చేయవలెను.
చర్చించవలసిన విషయములు
- ఈ యాక్టివిటీ నచ్చినదా లేదా?
- ఈ జపమాల శక్తివంతమైనదా కాదా? అయినచో దానికి కారణం ఏమిటి?
- ఏదైనా పనిని దైవ నామస్మరణ చేస్తూ చేసిన ఎడల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ఈ యాక్టివిటీ చేసినంత సేపు అందరి దృష్టి భగవన్నామస్మరణ మీద ఉండాలి. క్లాస్ అయిపోయాక ఆ జపమాలను వారికే ఇచ్చి పూజామందిరంలో పెట్టుకోమని చెప్పాలి. ప్రతిరోజు ఆ జపమాలను ఉపయోగించి వారికిష్టమైన నామము (గాయత్రి మంత్రం, ఓం నమశ్శివాయ, ఓం శ్రీ సాయిరాం) 27 సార్లు జపించమని చెప్పండి. ఏదైనా ప్రత్యేక సందర్భాలలో, ఉదాహరణకి, గణేష్ చతుర్థి రోజున, శ్రీ గణేశాయ నమః అని 108 సార్లు ఉచ్చరించమని(27*4) చెప్పండి.