ప్రేమ అన్నది సత్యానికి ప్రతిరూపం. ఇది ఆత్మ నుండి ఉద్భవించినది. ప్రేమ 9 గుణములను కలిగి వున్నది. అవి స్వచ్ఛమైనది , స్థిరమైనది , ప్రకాశ వంతమైనది, గుణ రహితమైనది, నిరాకారమైనది, ప్రాచీనమైనది, శాశ్వతమైనది, అమరత్వము మరియు అమృతమైనది.
ప్రేమ అనగా ఎవరినీ ద్వేషించకపోవటం. ప్రేమ అందరినీ ఏకం చేస్తుంది. ఏకాత్మ దర్శనమే ప్రేమతత్వము.
“ప్రేమ మనం పలికే మాటల్లో కలిస్తే అదే సత్యం.
ప్రేమ మన ఆచరణ లో కలిస్తే అదే ధర్మం.
ప్రేమ మన భావన లో కలిస్తే అదే శాంతి.
ప్రేమ మన అవగాహనలో కలిస్తే అదే అహింస.”
కనుక ప్రేమ అన్ని విలువల యొక్క అంతర్వాహినిగా ఉండి, అన్ని విలువలకు దైవిక గుణాన్ని చేకూరుస్తుంది. భగవంతుడిని హృదయపూర్వకంగా ప్రార్థించడమే ప్రేమ. ఒక చిన్న బాలుడికి భగవంతుని యందుగల భక్తిని, నిజమైన భక్తికి భగవంతుడు చూపే అనుగ్రహాన్ని “ప్రార్థన” అన్న కథ తెలుపుతుంది.
ప్రేమ యొక్క ఉపవిలువ దయ. అన్ని జీవుల పట్ల, జంతువుల పట్ల ప్రేమను ఎలా వ్యక్తపరచాలో “భూతదయ” అన్నకథ ద్వారా తెలుసుకోవచ్చు.