ఈశావాస్య మిదం
ఆడియో
సాహిత్యం
ఓం ఈశా వాశ్యమిదం సర్వం, యత్ కిఞ్చ జగత్యాం జగత్ ।
తేన త్యక్తేన భుఞ్జీతమాగృధః కస్యస్విద్ ధనమ్ ।
అర్థము:
ప్రమాదవశమున ఎప్పుడైనా మనకున్న ఉపనిషత్తులు, ఇతర పవిత్ర గ్రంథములన్నియు ఒక్కసారి అగ్నిలో పడి బూడిద అయినప్పటికీ, ఈశావాస్యోపనిషత్ లోని ఈ శ్లోకం మాత్రమే హిందువుల స్మృతిలో నిలిచి యున్నచో హిందూ ధర్మం చిరస్థాయిగా నిలిచిపోతుందని మహాత్మా గాంధీగారు అన్నారు.
ఈ విశ్వంలో మనం చూసే ఈ జగత్తు అంతా భగవంతునిచే వ్యాపించబడి ఉంది. కాబట్టి మనం ‘నేను’ మరియు ‘నాది’ అనే భావనను విడిచిపెట్టి, భగవంతుడు మనకు ఏది ఇచ్చినా కృతజ్ఞతతో స్వీకరించాలి మరియు దానిని మన తోటి జీవులతో పంచుకోవాలి. దురాశ మరియు స్వార్థం వంటి అన్ని భావాలను విడిచిపెట్టి ఈ సృష్టిలో అణువణువూ భగవంతునికి మాత్రమే చెందినదని గుర్తుంచుకోండి.
ఈ రెండు ఉపనిషత్తుల శ్లోకాలు భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని మరియు అన్ని సమస్త జీవులలో ఆయన ఉనికి గురించి నిరంతరం అవగాహన కలిగి ఉండాలని మనకు బోధిస్తాయి. మనం అన్ని జీవుల పట్ల ప్రేమను కలిగి ఉండాలి మరియు సర్వవ్యాప్తము,నిత్యసత్యము అయి, సమస్త చరాచర జీవులలో అంతర్లీనంగా ఉన్న భగవంతునికి సర్వశ్య శరణాగతి పొందే స్థితిని కలిగి ఉండాలి.
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0