Pyramid Perplexity
ఉద్దేశ్యము:
వివిధ మతములు – భిన్నత్వములోని ఏకత్వము యొక్క అవగాహన.
అనుబంధ విలువలు:
- పరిశీలన శక్తి
- ఆసక్తి
- జ్ఞాపకశక్తి
- మతసామరస్యము
కావలసిన వస్తువులు:
ప్రింట్ చేసిన / ముద్రించిన పిరమిడ్ చిత్రము, జవాబును తెలుపు సంకేతములు, పెన్ / పెన్సిల్.
గురువు యొక్క ముందస్తు సంసిద్ధత:
ఏమీ లేదు
ఏ విధంగా ఆడాలి?
- గురువు ముద్రించినటువంటి చిత్రమును ప్రతి ఒక్కరికి ఇవ్వాలి.
- ఏ విధముగా ఆడాలో వివరించాలి.
- జవాబును తెలుపు సంకేతములు విడిగా ఇవ్వాలి.
- సంకేతములను ఉపయోగించుకుని, పదములను గుర్తించి, గడులలో నింపవలెను.
- పిరమిడ్ లో ఇచ్చినటువంటి అక్షరము “A” యొక్క స్థానమును గమనించి కూడా సమాధానమును పొందవచ్చు.
- గురువులు మొదటి ప్రశ్న ప్రణవ మంత్రము సమాధానము – ‘AUM’ అని, ఉదాహరణగా చెప్పవచ్చు.
క్రింద ఇచ్చిన ఆధారాల అనుగుణంగా వివిధ మతములకు సంబంధించిన 10 పదములతో పిరమిడ్ గడులను పూరించండి. ప్రతి ఒక్క పదములోను “A” అక్షరము ఉండును.
ఆధారములు:
- ప్రణవ మంత్రము
- దీని అర్థము విజేత
- ఇస్లాం మతం యొక్క ప్రార్ధన
- సిక్కు మతముకు సంబంధించిన సార్వజనిక వంటశాల
- బుద్ధుడు తన మొదటి ప్రబోధన గావించినటువంటి ప్రదేశము
- జీసస్ ప్రబోధనల యొక్క చిన్న కథల సంకలనము
- హిందూ మతమునకు సంబంధించిన గ్రంథము
- జొరాస్ట్రియన్ల దైవము
- భజగోవిందంను రచించిన వారు
- మహావీర్ జైనుల ——–
సమాధానములు:
- AUM
- JINA
- NAMAZ
- LANGAR
- SARNATH
- PARABLES
- UPANISHAD
- AHURA MAZDA
- ADI SHANKARA
- TIRTHANKARAS