శ్రీ గణేశ కార్యాచరణ
రావి ఆకులతో గణేష్ ను తయారు చేయడం
దీనిలో ఉదాహరించిన విలువలు:
- జట్టు స్ఫూర్తి
- పర్యావరణానికి అనుకూలమైన కళాకృతిని తయారు చేయడం
- సృజనాత్మకతను ప్రోత్సాహించడం
అవసరమైన వస్తువులు:
- రావి చెట్టు ఆకులు (చెట్టు నుంచి రాలిన ఆకులు ప్రాధాన్యం)
పిల్లలను ముందుగా తయారు చేయడం:
పిల్లలు ఇంతకు ముందు తరగతిలో నేర్చుకున్న గణేష్ శ్లోకాలు పద్యాలు గురువులు గుర్తు చేయవచ్చు గణేష్ ఆకారాన్ని గుర్తు చేసుకుని ఆయా అంగాలను చెప్పమని అడగాలి. ఉదాహరణకు భారీ శరీరం, ఏనుగు తల పెద్ద చెవులు మొదలైనవి.
తరగతి లోని పిల్లల సంఖ్యను బట్టి కొన్ని సమూహాలుగా చేయండి. అందరూ వివిధ ఆకృతిలో తయారు చేయవచ్చు. సమూహమునకు అవసరమైన రావి ఆకులు ఇవ్వాలి.
కార్యాచరణ:
గణేష్ బొమ్మ తయారు చేయమని పిల్లలకు చెప్పాలి అందరూ సామూహికంగా తయారు చేసేందుకు పాల్గొనాలని కోరాలి. తగినంత అలంకరణ కూడా చేయమని చెప్పాలి. ఎవరికి వారు తమ నైపుణ్యాన్ని వెలికి తీసి ఊహాత్మకంగా తయారు చేయడానికి ప్రోత్సాహం ఇవ్వాలి.
చేస్తున్న సమయంలో గణేష్ భజన పాట పాడమని నేర్పించవచ్చు శ్రీ గణేశ (పాహిమాం) ఆయన దేవుడు శరణు కోరాలి (రక్షమాం) అప్పుడు ఆయన రక్షిస్తాడు ఇలా అర్థం చెప్పుకోవచ్చు.
రావి ఆకులతో చేయడం – రావిచెట్టు పవిత్రమైనది మరియు భిన్నమైంది. అశ్వద్ధ వృక్షం అంటారు. రావి ఆకులు రాత్రి పూట కూడా ఆక్సిజన్ బాగా వదులుతాయి. అందుకే రావి చెట్టు నీడ మంచిది. అలాగే గణేష్ కూడా స్వచ్చమైన ప్రేమ భక్తి తో హృదయపూర్వకంగా ప్రార్థిస్తే సమయం ప్రదేశంతో సంబంధం లేకుండా మనల్ని రక్షిస్తాడు.
భారత దేశంలో అనేక చోట్ల రావి చెట్ల కింద గణేష్ విగ్రహాలు చూడవచ్చు. దీన్ని తమిళంలో మరమ్ అని పిలుస్తారు. ఇది ఓజోన్ (03) గరిష్ట స్థాయిలో విడుదల చేస్తుంది. అందువల్ల మనుషులు అన్ని చెట్లలోకి రాజు అని పిలుస్తారు.
ఇప్పుడు భజన పాట పాడుతూ గణేష్ ను ప్రార్థించుదాం
- శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ పాహిమాం
- జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమామ్
- శ్రీ గణేశ పాహిమాం జయ గణేశ రక్షమామ్
- జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమామ్