పరమ పవిత్రమైన “రామ” నామం లో, ‘ర’ అనగా- అగ్ని బీజము (అగ్ని), ‘అ’ అనగా- సుర్య బీజము (సూర్యుడు), ‘మ’ అనగా- చంద్ర బీజము (చంద్రుడు)ను సుచిస్తుంది. కాబట్టి “రామ” అనగా అజ్ఞానాన్ని తొలగించి, తాపముకు చల్చర్చి, పాపములను భస్మం చేయునది అని అర్ధము. రామనామమును ఉచ్ఛరించినపుడు పాపములను బయటికి పంపి, తిరిగి ఆ పాపములను లోనికి రాకుండా చేయుటమే రామనామ విశిష్టత -బాబా
కలియుగములో రామనామామే తారకమంత్రము. ఈ రామ భజనలను మనము ఉత్సాహాంగా ఆలపిస్తున్నపుడు మన హృదయము ఆ దివ్య నామంతో పులకించాలి.