అనుభవపూర్వక అభ్యాస క్రియల ద్వారా మన లోపలి దైవత్వాన్ని అనుభవించడం వల్ల , పిల్లల సమగ్ర అభ్యాసం మరియు అవగాహన మెరుగు పడుతుంది.
ప్రారంభంలో పిల్లలు వివిధ వైరుధ్య మరియు నిర్దిష్ట పదాల గురించి ఆలోచించమని అడుగాలి. బాల వికాస్ గురువు మార్గదర్శకత్వంలో తరగతి ఏకాభిప్రాయం ద్వారా ఒక శీర్షిక ఎన్నుకుంటుంది.
తర్వాత, ఆ నిర్దిష్ట థీమ్ (శీర్షిక) పై దృష్టి కేంద్రీకరించడానికి గురువు తరగతిని ప్రేరేపించాలి. ఆ శీర్షికకు సంబంధిత పదాలను ఎలాంటి క్రమాన్ని పాటించక వ్రాయించాలి.
ఇప్పుడు పిల్లలు వివిధ కేటగిరీల క్రింద ఈ పదాలను మ్యాప్ (4,5 చిన్న అంశాలుగా, కూర్పు) చేయాలి మరియు వెబ్ చార్టును సిద్ధం చేయాలి.
వెబ్-చార్టు లోని ఒక్కో విభాగమును అవగాహన చేసుకోవడానికి, తరగతిని వాటి సంఖ్యకు సమానమైన చిన్న సమూహాలుగా విభజించి ఒక్కో చిన్న అంశాన్ని కేటాయించాలి. తర్వాత ఈ గ్రూపుల్లో ప్రతి గ్రూపు ఐదు బోధనా పద్ధతులను( శ్లోక పఠనం, కథలు చెప్పడం, మార్గదర్శక దృశ్యీకరణ, బృంద గానం మరియు సామూహిక కార్యకలాపాలు) ఉపయోగించి ప్రదర్శన సిద్దం చేయాలి.
ప్రదర్శనలో శ్లోకాలు/పద్యాలు/ సామెతలు ఉల్లేఖనాలు/కథలు/ మార్గదర్శక ధ్యానం/ స్కిట్లు/ రోల్ ప్లేలు, క్విజ్/ వైఖర్ పరీక్షలు/ గ్రూప్ పాటలు, డ్యాన్స్/డిబేట్స్/ గ్రూప్ డిస్కషన్/ పోస్టర్ మేకింగ్/ఎగ్జిబిషన్ మొదలైన కార్యకలాపాలు ఉండవచ్చు.
ఈ గ్రూప్ యాక్టివిటీ లో పిల్లల అంతర్గత జ్ఞాన ప్రకటనకు & సృజనాత్మకతకు విస్తారమైన అవకాశం లభిస్తుంది.
గురువులు మరియు పిల్లలు ఇద్దరూ కార్యక్రమాలను విపరీతంగా ఆస్వాదిస్తారు. మరియు ఇది పిల్లల మనస్సులలో శాశ్వతమైన ముద్రను వేస్తుంది. తద్వారా అభ్యాస ప్రక్రియ గొప్ప విజయవంతము అవుతుంది.!