హారతి – మరింత చదవడానికి

Print Friendly, PDF & Email
హారతి – మరింత చదవడానికి

హిందూ పూజ విధానంలో హారతి అన్నది చాలా ప్రధానమైనది. ఏదైనా భజన కార్యక్రమం, సత్సంగం లేదా ఏవైనా సేవా కార్యక్రమాలు జరిగినప్పుడు చివరగా భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారికి హారతి సేవ చేయబడుతుంది.

ఈ హారతి పాట యొక్క సాహిత్యమును అర్థం చేసుకుని, హారతి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందులోని సాహిత్యాన్ని దోషాలు లేకుండా సక్రమమైన రీతిలో ఉచ్చరిస్తూ పాడటం అన్నది చాలా ముఖ్యం. దోష రహితంగా ఉచ్ఛరించటం వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

పూర్వపు రోజుల్లో స్వామి తానే స్వయంగా తన మందిరానికి హారతినిచ్చి, ఆ హారతిని అక్కడున్న భక్తులందరికీ చూపేవారు.

ప్రస్తుతం రేడియో సాయి భజన ట్యుటోరియల్ వారు అంకితభావంతో స్వామి యొక్క మంగళ హారతి పాట యొక్క అంతరార్థాన్ని వివరిస్తూ ఆరు ఎపిసోడ్లు చేశారు.

ఇందులో స్వామి వారి యొక్క హారతి పాట స్పష్టంగా ఎలా పాడాలి?

దోషాలు లేకుండా ఎలా వుచ్ఛరించాలి? పాట యొక్క అంతరార్థాన్ని ఎలా అవగాహన చేసుకోవాలి? అన్న విషయాలు బోధించారు.

హారతి ట్యుటోరియల్- మొదటి భాగము

ఈ సెషన్ లోని మొదటి భాగంలో శ్రీ సత్య సాయి హారతి పాట లోని మొదటి కొన్ని పంక్తులు, వాటి రాగము, స్వరాలు, తాళము మరియు పాట యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు.

హారతి టుటోరియల్ – రెండవ భాగము

శ్రీసత్యసాయి హారతి పాట ప్రత్యేక ధారావాహిక రెండవ ఎపిసోడ్ నందు
హారతి ఆచారంలో దాగియున్న లోతైన అంతరార్థం ఏమి?
హారతి ఎందుకు? దాని యొక్క ప్రాముఖ్యత ఏమి? ఎలా నిర్వహించాలి?
అనే వాటి గురించి చర్చలు జరిపారు.

హారతి ట్యుటోరియల్ – మూడవ భాగము

శ్రీ సత్యసాయి హారతి పాట ప్రత్యేక ధారావాహిక మూడవ భాగంలో హారతి పాటలోని “శశివదన…” అనే మొదటి చరణం యొక్క అర్థము అందంగా వివరించబడింది.

హారతి ట్యుటోరియల్ – నాల్గవ భాగము

శ్రీ సత్యసాయి హారతి పాట ప్రత్యేక ధారావాహిక యొక్క నాల్గవ ఎపిసోడ్ నందు, “మాతపితా….” అనే రెండవ చరణం యొక్క లోతైన అంతరార్థాన్ని చాలా చక్కగా చర్చించారు.

హారతి ట్యుటోరియల్- ఐదవ భాగము

శ్రీసత్యసాయి హారతి పాట ప్రత్యేక ధారావాహికలోని ఐదవ ఎపిసోడ్ లో, “ఓంకార రూప…” అన్న చివరి చరణం చాలా విపులంగా వివరించబడింది.

హారతి ట్యుటోరియల్ – ఆరవ భాగము

శ్రీసత్యసాయి హారతి పాట ప్రత్యేక ధారావాహిక యొక్క చివరి ఎపిసోడ్ నందు హారతి పాట చివరి పంక్తులయిన “నారాయణ నారాయణ” అన్న వాటిని గురించి వివరణాత్మకంగా చర్చించారు.
ఈ ఎపిసోడ్ నందు “నారాయణ” అనే పదం యొక్క అర్థం చాలా విస్తృతంగా వివరించబడింది.

Audio Source :

http://dl.radiosai.org/RADIO_SAI_BHAJAN_CLASSROOM_348_ARATI_PART_01.mp3

http://dl.radiosai.org/RADIO_SAI_BHAJAN_CLASSROOM_349_ARATI_PART_02.mp3

http://dl.radiosai.org/RADIO_SAI_BHAJAN_CLASSROOM_350_ARATI_PART_03.mp3

http://dl.radiosai.org/RADIO_SAI_BHAJAN_CLASSROOM_351_ARATI_PART_04.mp3

http://dl.radiosai.org/RADIO_SAI_BHAJAN_CLASSROOM_352_ARATI_PART_05.mp3

http://dl.radiosai.org/RADIO_SAI_BHAJAN_CLASSROOM_353_ARATI_PART_06.mp3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *