బ్రహ్మార్పణం

బ్రహ్మార్పణం – వివరణ
బ్రహ్మా బ్రహ్మమే
అర్పణం యజ్ఞము యందు ఉపయోగించే హోమ సాధనములు
బ్రహ్మ బ్రహ్మమే
హవిః హోమద్రవ్యములు
బ్రహ్మాగ్నౌ బ్రహ్మమనెడీ అగ్ని యందు
బ్రహ్మణా బ్రహ్మస్వరూపుడగు యజమాని చేత
హుతమ్ హోమము చేయబడినది
బ్రహ్మ బ్రహ్మమే
ఏవ యగును
తేన అతని చేత (ఆ బ్రహ్మనిష్ఠుని చేత)
గన్తవ్యం పొందదగిన ఫలము
బ్రహ్మ కర్మ సమాధినా సర్వము బ్రహ్మ స్వరూపమే అనెడి ఏకాగ్ర భావముతో ఆ యజ్ఞాది కర్మలను చేయు