స్వామి వివేకానందుని జీవితము నుంచి ఒక ఘట్టము

Print Friendly, PDF & Email
చిన్న కథ- స్వామి వివేకానందుని జీవితము నుంచి ఒక ఘట్టము

ఒకానొక వేసవికాలం మిట్ట మధ్యాహ్నం సమయంలో, స్వామి వివేకానందుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రమున తారిఘాట్ అనే స్టేషన్లో థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ నుంచి దిగారు. అప్పుడు ఆయన వేషధారణ ఒక సన్యాసి లాగా ఎంతో సాధారణంగా కాషాయ రంగు అంగితో దిగారు. ఆ ఒక్క థర్డ్ క్లాస్ టికెట్ తప్ప ఆయన దగ్గర ఏమీ లేదు. మంచినీళ్ళ కమండలం/ మరచెంబు కూడా లేదు. పోర్టర్ స్టేషన్ లో ఉండుటకు అంగీకరించకపోయేసరికి థర్డ్ క్లాస్ ప్యాసింజర్స్ వేచి ఉండే షెడ్ లో ఒక స్తంభం దగ్గర చేరగిలిడి కూర్చున్నారు. ఆ షెడ్ నందు అన్ని ప్రాంతంలో నుంచి వచ్చిన వివిధ ప్రకారమైన జనులు చేరి ఉన్నారు. స్వామి వివేకానందునికి ఎదురుగా ఉత్తర భారతదేశం నుండి వచ్చిన ఒక నడివయస్కుడు వ్యాపారవేత్త తివాచీ పరచుకుని కూర్చున్నాడు. ఆకలి దప్పికలతో నీరసంగా ఉన్న స్వామి వివేకానందుని చూసి రాత్రి తనతో పాటు కంపార్ట్మెంట్లో ప్రయాణం చేసినట్లు గుర్తించాడు. స్వామి వివేకానందుని యొక్క స్థితిని పరిహాసం చేస్తూ ఆ ముందు రాత్రి ప్రయాణ సమయంలో వివిధ స్టేషన్ లలో ట్రైన్ ఆగినప్పుడు స్వామి వివేకానందునికి ఎంతో దాహం వేసినా చేతిలో డబ్బు లేకపోయేసరికి మంచినీళ్లు కొనుక్కుని దాహం తీర్చుకోలేకపోయారు. కానీ ఆ వ్యాపారి వాటర్ అమ్మే వాళ్ళ దగ్గర నీళ్లు కొనుక్కుని తన దాహాన్ని తీర్చుకున్నాడు. తన దాహం తీర్చుకుంటూ స్వామి వివేకానందుని యొక్క పరిస్థితిని చూసి పరిహాసము చేస్తూ అవహేళన చేస్తూ, “చూడు నాయనా! ఈ నీళ్లు ఎంత మధురంగా ఉన్నాయో, నీవు సన్యాసి వి అవటం వలన/ అగుటవలన ధనార్జనను వదిలివేయడం వలన పైకము లేక నీవు ఈ మంచినీళ్లను కొనలేకపోయావు. అందుకని ఈ మంచినీళ్ళ మాధుర్యాన్ని అనుభవించలేకపోతున్నావు. నాకు లాగా బాగా డబ్బు సంపాదించి జీవితాన్ని అనుభవించ వచ్చు కదా అని మాట్లాడాడు. భవబంధాలను తెంచుకొని, ప్రాపంచిక సుఖాలను పరిత్యజించి భగవంతుని యందు నిమగ్నమైన సన్యాసులు అంటే తనకు గిట్టక/ ఇష్టం లేక స్వామి వివేకానందుని పరిపరి విధములుగా, అనేక ఉదాహరణలతో, వాదనలతో స్వామి వివేకానంద ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితికి ఆయన యొక్క శరణాగత తత్వమే కారణమని నిందించి/ తూలనాడాడు/ విమర్శించాడు. అంతటితో ఆగక చూడు నేను ఎంత రుచికరమైన పూరీలు, లడ్లు తింటున్నానో, నీకు ధనార్జనతో సంబంధం లేదు కాబట్టి, నీకు డబ్బుతో సంబంధం లేదు కాబట్టి, దప్పికతో గొంతు ఎండిపోయి ఆకలితో నీరసించి, కటిక నేల మీద ఉన్నటువంటి నీ ప్రస్తుత పరిస్థితి సరియైనదే అని స్వామి వివేకానందుని అపహాస్యము చేశాడు. కానీ స్వామి వివేకానందుడు వీటన్నిటికీ ఏమి జవాబు చెప్పక నిశ్చలంగా, ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. ఇంతలో ఆ ఊరిలో నివసించే స్థానికుడు ఒకడు ఒక మూటతో, కుడి చేతిలో glass, ఎడమచేతి చంక కింద ఒక తివాచీతో, తల మీద చల్లని మంచినీళ్ళ కుండతో ప్రత్యక్షమైనాడు. హడావిడిగా, గబగబా తివాచిని పరిచి తను తెచ్చిన వస్తువులన్నీ ఆ తివాచీ మీద అమర్చి స్వామి వివేకానందని వైపు చూస్తూ” బాబాగారు ఇటు వచ్చి నేను తీసుకొచ్చిన ఆహారాన్ని స్వీకరించండి” అని ప్రార్థించాడు. స్వామి వివేకానందునికి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. ఎవరీ కొత్తగా వచ్చిన మనిషి? ఏం మాట్లాడుతున్నాడు? అని అనుకున్నాడు. అప్పటిదాకా ఎగతాళి చేసిన ఆ వ్యాపారి కూడా దిగ్భ్రాంతితో ఇదంతా గమనించ సాగాడు. ఆ కొత్తగా వచ్చిన స్థానికుడు స్వామి వివేకానందుని “బాబా గారు మీరు వచ్చి ఆహారాన్ని స్వీకరించాలి” అని పట్టుపట్టాడు. అప్పుడు స్వామి వివేకానందుడు అయ్యా! మీరు పొరబడుతున్నట్టున్నారు. మీరు నన్ను ఎవరినో అనుకుంటున్నారు. నేను మిమ్మల్ని ఇంతకుముందు కలిసిన జ్ఞాపకం కూడా లేదు అని అన్నాడు. అప్పుడు ఆ స్థానికుడు ఇలా అన్నాడు లేదు. నేను పొరబడుటలేదు. నేను చూసినటువంటి బాబాగారు మీరే. దాంతో వివేకానందుడు మరింత ఆశ్చర్యపోయి మీరు ఏమంటున్నారు మీరు నన్ను ఎక్కడ చూశారు? అని అడిగాడు. అప్పటివరకు తమాషా చేసిన పరిహాసం చేసిన ఆ వ్యాపారి కూడా ఉత్కంఠంతో చూడసాగాడు. అలమటించుతున్నాడు, నాకు ఎంతో బాధగా ఉంది అని అన్నాడు. అందుకని నీవు వెంటనే లేచి పూరి, కూర తయారు చేసుకుని, మధురమైన మిఠాయిలు తీసుకుని, చల్లని మంచినీళ్లు తివాచీతో రైల్వే స్టేషన్ కి వెంటనే తీసుకుని వెళ్ళు అని ఆజ్ఞాపించారు. ఇంతలో నాకు మెలకువ వచ్చింది. ఇదంతా ఒక కల అనుకుని పక్కకు తిరిగి మళ్లీ నిద్రపోయాను. ఈసారి ఆ శ్రీరామచంద్రుడు సాక్షాత్కరించి నన్ను తోసినంత పని చేసి, కుదిపి లేపి వెంటనే నేను చెప్పినట్లు చేయి అని ఆజ్ఞాపించారు. వెంటనే నేను మరి ఆలస్యం చేయక ఆ శ్రీరాముడు చెప్పినట్లు అన్నీ అమర్చుకొని పూరి, దుకాణం నుంచి మిఠాయిలు, చల్లని నీళ్లు, తివాచి తీసుకుని పరిగెత్తి నేరుగా ఇక్కడికి వచ్చాను. ఆ స్థానికుడు ఇలా చెప్పాడు నేను ఒక మిఠాయి దుకాణదారుడిని. మామూలుగా అలవాటు ప్రకారం మధ్యాహ్న సమయంలో, చిన్న కునుకు తీసే సమయంలో ఆ శ్రీరామచంద్రుడు నా కలలో వచ్చి, మిమ్మల్ని చూపించి, గత రాత్రి నుండి నా భక్తుడు ఆకలిదప్పికలతో చూడటంతోటే మిమ్మల్ని గుర్తించాను. అందుకని ఈ మాత్రం సందేహించక వచ్చి ఆహారాన్ని స్వీకరించండి. మీరు ఎంతో ఆకలితో ఉండి ఉంటారు అని పలికాడు. ఇదంతా విన్న వివేకానందుని స్థితిని మనం ఊహించుకోగలం. ఆనందభాష్పాలతో, మనస్ఫూర్తిగా ఆ స్థానికునకు వివేకానందుడు వినయముగా కృతజ్ఞతలు తెలిపాడు. కానీ స్థానికుడు “బాబా గారు మీరు నాకు కృతజ్ఞతలు చెప్పవద్దు. ఇదంతా ఆ శ్రీరాముని సంకల్పము” అని అన్నాడు. ఇదంతా గమనిస్తూ ఉన్న ఆ వ్యాపారి తను చేసిన పనికి సిగ్గుపడి, వివేకానందుని క్షమాపణలు అడిగి అక్కడ నుంచి తక్షణమే కనుమరుగయ్యాడు.

అనన్య శరణాగతి. దీనిని కూడా మళ్లీ తల్లి-బిడ్డల ఉపమానం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఒక నవజాత శిశువు పూర్తిగా తన తల్లి మీదనే ఆధారపడి ఉంటుంది; ఆమే శిశువుకు కావలసినవన్నీ చూసుకుంటుంది. బిడ్డ ఏమైనా కావాలంటే కేవలం ఏడుస్తుంది; అమ్మనే బిడ్డను శుభ్రంచేయటం, అన్నంపెట్టడం, స్నానం చేపించటం వంటి పనులన్నీ చేస్తుంది. కానీ, బిడ్డకి ఐదు సంవత్సరముల వయస్సు వచ్చినప్పుడు, కొన్ని పనులు తనంత తానే చేసుకుంటుంది. ఆ మేరకు తల్లి తన పనులు తగ్గించుకుంటుంది. ఇంకా, అదే బిడ్డ యుక్త వయస్సు వచ్చి, అన్ని భాద్యతలూ తనే తీస్కున్నప్పుడు, అమ్మ తన భాద్యతను ఇంకా తగ్గించుకుంటుంది. ఇప్పుడు తండ్రి ఇంటికి వచ్చి, “మన కొడుకు ఏడి?” అని అడిగితే, అమ్మ, “స్కూలు నుండి ఇంకా ఇంటికి రాలేదు. స్నేహితులతో కలిసి సినిమాకి పోయాడేమో” అంటుంది. ఆమె యొక్క వైఖరి ఇప్పుడు వాడి పట్ల ఉదాసీనంగా ఉంటుంది. కానీ, ఇదే పిల్లవాడు ఐదు సంవత్సరముల వయస్సులో ఉన్నప్పుడు, స్కూలు నుండి రావటం పది నిముషాలు ఆలస్యం అయితే, అమ్మ-నాన్న చింతించటం మొదలుపెడతారు, “ఏమయిందో? వాడు చిన్నవాడు. వాడికేమీ ప్రమాదం జరగలేదు కదా. ఒకసారి స్కూల్ కి ఫోన్ చేసి కనుక్కుందాం.” అని అనుకుంటారు.

ఈ ప్రకారంగా పిల్లవాడు మరింత భాద్యతలు తీసుకున్నకొద్దీ, ఆ తల్లి తన భాధ్యతని త్యజిస్తూ ఉంటుంది. భగవంతుని చట్టము కూడా ఇలాగే ఉంటుంది. మన సొంత స్వేచ్చా చిత్తము తో ప్రవర్తిస్తూ, మన కర్మలను చేసేది మనమే అని అనుకున్నప్పుడు, మన సొంత శక్తి సామర్ధ్యాల మీద ఆధారపడి ఉన్నప్పుడు, భగవంతుడు తన కృపని ప్రసాదించడు. కేవలం మన కర్మలను నోటు చేసుకుంటూ ఫలములను ఇస్తుంటాడు. మనం పాక్షికంగా ఆయనకు శరణాగతి చేసి, పాక్షికంగా భౌతిక ఆధారాలపై ఆధారపడినప్పుడు, భగవంతుడు కూడా తన కృప ను పాక్షికంగా ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే మనల్ని మనం పూర్తిగా సమర్పించుకుంటామో, ‘మామేకం శరణం వ్రజ’, భగవంతుడు తన పూర్తి అనుగ్రహముని ప్రసాదించి, మనకు ఉన్నవాటిని సంరక్షిస్తూ, మనకు లేని వాటిని సమకూరుస్తూ, మన పూర్తి భాద్యతను తను స్వీకరిస్తాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *