నెమ్మదిగా పయనించండి సురక్షితంగా చేరుకోండి

Print Friendly, PDF & Email
నెమ్మదిగా పయనించండి సురక్షితంగా చేరుకోండి
లక్ష్యం:

పెన్సిల్ మరియు కాయిన్ గేమ్ అనేది గురుత్వాకర్షణ, సమతుల్యత, సమరూపత మరియు చక్కటి రూపకల్పన గురించి పుష్కలంగా నేర్చుకునే అనుభవాలను అందించే వినోదంతో కూడిన కార్యకలాపం.

సంబంధిత విలువలు:
  • ఏకాగ్రత
  • సహనం
  • దృఢత్వం
  • సంకల్పం
  • పట్టుదల
  • సమస్య పరిష్కారం
  • ఆత్మ తృప్తి
  • సాఫల్యం
కావలసిన పరికరములు:
  1. ఓకే పరిమాణంలోనున్న ఒక రూపాయి నాణేలు – 10.
  2. పెన్సిల్ – ఒక చివర చెక్కినదిగా మరొకవైపు చదునుగా ఉండవలెను
  3. పెద్ద బంగాళాదుంప సగం ముక్క
  4. చిన్న పళ్ళెము
  5. గడియారము
గురువు ముందస్తుగా తయారుచేయావలసినది:

ఏదీ లేదు

ఆట ఆడు విధానము:
  1. గురువు పిల్లలకు ఆట గురించి వివరిస్తాడు.
  2. ప్రతియొక్క ఒక్క పిల్లలకు సగం కట్ చేసిన బంగాళాదుంపను చిన్న పల్లెలో ఉంచవలెను.
  3. పిల్లలు చెక్కిన పెన్సిల్ భాగమును బంగాళాదుంపలోకి చొప్పించవలెను (ఇది స్టాండ్గా పనిచేస్తుంది).
  4. పది నాణేములను పెన్సిల్ యొక్క మరొక చివరలో ఒక్కొక్కటిగా ఉంచవలెను.
  5. అలా చేస్తున్నప్పుడు, కొన్ని నాణేలు పడిపోయినా, పిల్లలు తమ ప్రయత్నాన్ని కొనసాగించడానికి అనుమతించవలెను.
  6. గురువు అందరిచేత ఒకే సమయంలో ఆట ప్రారంభింపజేయవలెను.
  7. నిర్ణీత సమయంలో మొత్తం పది నాణేలను ఉంచిన వ్యక్తి విజేతలుగా నీలిచెదరు.
గురువులకు చిట్కాలు:
  • కుందేలు & తాబేలు కథ.
  • రాబర్ట్ బ్రూస్ మరియు స్పైడర్ & ఇతరులు సంబంధం కధలు ఉపయోగకరముగా నుండును.
సంబంధిత సూక్తులు:
  • నిదానమే ప్రధానము
  • నెమ్మదిగా, జాగర్తగా పయనించిన విజయం నీ సొంతమవుతుంది
  • తొందరపాటు అనర్దానికి దారితీస్తుంది