గీతాంజలి

Print Friendly, PDF & Email
గీతాంజలి
లక్ష్యము:

పిల్లలు నేర్చుకున్న గీతా శ్లోకాలను గుర్తుకు తెచ్చుకుని, జ్ఞాపకశక్తికి పదునుపెట్టే తమాషా ఆట.

సంబంధిత విలువలు:
  • ఉత్సుకత
  • గమనించుట
  • ఏకాగ్రత
  • జ్ఞాపక శక్తి
  • ఓర్పు
  • ఖచ్చితత్త్వము
  • ఆత్మ సంతృప్తి
కావాల్సిన సామాగ్రి:
  • అట్ట
  • రంగుల పెన్నులు / స్కెచ్ పెన్స్
గురువు ముందస్తు తయారీ:
  • గురువు పది భగవద్గీత శ్లోకాలను గుర్తించాలి.
  • చిన్న కార్డ్స్ ఒక 20 (పేక ముక్క పరిమాణం లో) కత్తిరించుకోవాలి.
  • 10 నీలిరంగు, 10 గులాబీ రంగు కార్డ్స్ చెయ్యాలి.
  • నీలి కార్డ్స్ మీద ఎంచుకొన్న 10 శ్లోకాల మొదటి పంక్తిని, గులాబీ కార్డ్స్ లో రెండవ పంక్తులను రాయాలి.
  • కార్డ్స్ వెనకాల స్వామి వారి బొమ్మ ను అతికించాలి.
  • కార్డ్స్ అందంగా, కళగా ఉండాలి. (స్వామి వారి పాకెట్ సైజు క్యాలెండరు వెనక వైపు రాయొచ్చు)
  • ఇలా కార్డ్స్ తయారు చేసుకోవాలి.
ఎలా ఆడాలి
  1. గురువు కార్డ్స్ బాగా కలపాలి.
  2. రంగు తో సంబంధం లేకుండా ఐదేసి కార్డ్స్ నాలుగు వరుసలుగా పేర్చాలి.
  3. కార్డ్స్ ని బోర్లా ఉంచాలి శ్లోకం పంక్తి కనపడకుండా.
  4. ఒకసారి నలుగురు పిల్లలు ఆడవచ్చు.
  5. మొదటి చిన్నారి ఒక నీలం మరియు ఒక గులాబీ కార్డు తీసి పంక్తులు ఒకే శ్లోకానివా, కాదా అని పరిశీలించాలి.
  6. అవి ఒకే శ్లోకానివైతే, చదివి తన దగ్గరే పెట్టుకుంటాడు. అతను మళ్ళీ ఆడవచ్చు.
  7. అలా ఒకే శ్లోకం రాకపోతే కార్డ్స్ పిల్లలందరికీ చూపించి మళ్ళీ యధా స్థానం లో పెట్టాలి.
  8. తర్వాత చిన్నారి మరో రెండు కార్డ్స్…అలాగే అన్ని శ్లోకాలు అయిపోయేవరకూ ఆడవచ్చు.
మార్పులు, చేర్పులు:
  • గీతా శ్లోకాలు, అర్ధాలు కూడా ఇవ్వవచ్చు.
  • శ్లోకంలో మొదటి పదం, చివరి పదం తో కూడా ఆడవచ్చు.
గురువులకు సూచనలు:

పిల్లల స్థాయిని బట్టి, time ను బట్టి ఎన్ని గీతా శ్లోకాల తో అయినా ఆడవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *