భజగోవిందం – ఆది శంకరాచార్య
భజగోవిందం – ఆది శంకరాచార్య – Quiz
- భజగోవిందం అంటే అర్ధమేమిటి?
జ. భజగోవిందం అంటే గోవిందుని కోరుకోవడం, దేవుణ్ణి వెతకడం.
- భజగోవిందం అనగా –
జ. మోహముద్గర, భ్రమలను తొలిగించేవాడు.
- ఆది శంకరా చార్యులు —– జీవించి —— సిద్ధాంతమును స్థాపించారు.
జ. 32 సం||లు, అద్వైత వేదాంతము.
- శంకరుని జన్మ విశేషాలను తెల్పిండి.
a. జన్మస్థలము
b. జీవితకాలము
c. తల్లిదండ్రుల పేర్లు
d. జన్మకు కారణముజ. a. కేరళ రాష్ట్రంలోని కాలడి అను గ్రామము
b. క్రీ. శ. 8వ శతాబ్దము
c. శివగురువు మరియు ఆర్యాంబ
d. శంకరుడు త్రిచూరులోని వృషభాచలేశ్వరుని దేవాలయం లోని శివుని ప్రార్థించగా జన్మించెను. - శంకరుని బాల్యవిశేషాలు ఏవి?
జ. శంకరా చార్యుడు ప్రస్తుత కేరళ రాష్ట్రంలోని “కాలడి” అను గ్రామంలో 8 వ శతాబ్దంతో ఆర్యాంబ, శివగురువులకు గంటూరి బ్రాహ్మణ కుటుంబమున జన్మించెను. శంకరుడు తల్లి దండు)లకు ఒక్కడే కుమారుడు. శంకరుడు 8 సం||ల చిన్న వయస్సుననే అఖండ ప్రజ్ఞావంతుడై, వేదములను చదివెను. అతని చిన్న వయస్సుననే తండ్రి మరణించినందున తల్లి ఎంతో ప్రేమతో పెంచెను. శంకరుని యొక్క సన్యాస దోరణికి అతని తల్లి కలత చెందినది.
ఒకనాడు శంకరుడు సమీపంలోని పూర్ణానదిలో స్నానం చేయు చుండగా, తల్లి ఒడ్డున ఏదో పని చేనుకును చుండెను. ఆ సమయంలో హఠాత్తుగా శంకరుని పాదములను ఒక మొసలి పట్టి లాగా చున్నది. ఇలా శంకరుని షాదములను ఒక మొసలి నీటిలోనికి లాగివేయగా, శంకరుడు ” అమ్మా నన్ను మొసలి పట్టి లాగు చున్నది. నాకు మరణం తథ్యము అని అరచెను . ” అమ్మా ఈ మరణ కాలమున సన్యసించుటకు అనుమతినిమ్ము” లేకున్న నీ కుమరుడు నీకు దక్కడు’ అని తల్లిని ప్రార్థించెను. ఎంతో అయిష్టతతో ఆర్యాంబ శంకరుడు సన్యసించుటకు అనుమతి ఇచ్చెను. వెంటనే శంకరుని మొసలి వీదలి వేసినరి. ఇట్లు శంకరుడు తన 8వ యేటనే సన్యసించి, సన్యాసి అయ్యి దేశయాత్ర చేయుటకై ఇల్లు వదలి వెళ్ళను. ఇల్లు వదలుటకు ముందు ” తల్లి తనను ఎప్పుడు స్మరించునో అప్పుడు తన చివరి రోజులలో తన సమక్షమునకు రాగలనని వాగ్ధానము చేసెను.
- శంకరుడు తన జన్మ స్థలమును వదలి —– తీరము చేరి ——- కలిశారు. వీరు —– శిశ్యుడు. వీరిచే ——– అను ప్రసిద్ధి చెందిన గ్రంథాన్ని రచించారు.
జ. నర్మదా, గోవింద భగవత్పదుడు, గౌడడపాదుడు, మండుశ్యకారక.
- శంకరుడు వేదముల సాధనకు ఎంతకాలము పట్టినది?
జ. దాదాపు 7 సం॥లు.
- వేద అధ్యాయనము పూర్తి అయిన తర్వాత వారి గురువు ఏమి చేయమని చెప్పెను?
జ. తన గురువు గారి ఆజ్ఞపై శంకరుడు కాశీనగరం చేరి అచట అద్వైత వేదాంతము వ్యాఖ్యానాలను, (బ్రహ్మసుత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఔన్నత్యయమును చాటి చెప్పెను.
- శంకరా చార్యులు ఏవిధంగా ఆద్వైత వేదాంతమును వ్యాప్తి చేయెను?
జ. శంకరాచార్యులు, కాశీనగరం చేరుకొని అచ్చట మహా పండితులతో, వాదము చేసి, వారందరిని ఓడించి ఆద్వైత వేదాంతము మొక్క ఔన్నత్యమును వ్యాప్తి చేసెను.
- శంకరాచార్యులు ——– వయస్సులో —– లో గొప్ప వేదాంతము యోక్క ఔన్నత్యమును సాపించెను
జ. 16సం॥లు, కాశీ
- శంకరాచార్యాలు అతి తక్కువ వయస్సులో వున్నపుడు ——- చెప్పుతున్న తరుణంలో స్వయంగా —— దర్శనమిచ్చి, భారతదేశంలో ———- చేయ మని ఆశర్వదించెను.
జ. బ్రాహ్మసుత్రాల భాష్యం, వేదవ్యాసుడు, దిగ్విజయయాత్ర/ ఆధ్యాత్మిక విజయము
- శంకరాచార్యులు సత్యమనే ఆద్వైతసిద్ధాంతమును స్థాపించిన తర్వాత —— శిష్యుడైన ——–, శంకరా చార్యులకు మధ్య ————– అనే అంశములపై వాదన జరిగినది.
జ. కుమరల భట్టు, మండన మిశ్రుడు, జ్ఞానకాండ, కర్మకాండ.
- ఈ వాదన లో
a. న్యాయనిర్ణేతగా వున్నది ఎవరు?
b. ఆ శంకరునితో వాదనకు దిగిన వారు న్యాయ నిర్ణేతకు ఏమగుదురు?
c. వాదన తర్వాత వాదనలో పాల్గొన్న వ్యక్తిని ఏ పేరుతో పిలువ బడెను?జ. a. ఈ వాదన లో ఉభాయ భారతి.
b. శంకరునితో వాదనకు దిగిన వ్యక్తి న్యాయ నిర్ణేత భర్త. అనగా ఉభయ భారతి భర్త మండన మిశ్రుడు.
c. శ్రీ సురేశ్వరాచార్య. - శంకరాచార్యులవారు స్థాపించిన మఠాములు, వాటి పేర్లు, వారి ప్రధాన శిష్యులు ఎవరు?
జ. శంకరాచార్యులు స్థాపించిన మఠాములు, ప్రధానశిష్యులు ఎవరనగా,
i) దక్షిణమున – శృంగేరి మఠాము, పఠాధిపతి – శ్రీ సురేశ్వరాచార్య
ii) ఉత్తరాన – బద్రనాథ్ – మఠాధిపతి – తోటకుడు.
iii) పచ్చిమన – ద్వారకా మఠాము, మఠాధిపతి – పద్మపాదుడు.
iv) తూర్పాన – పూరిజగన్నాథ్. మఠాధిపతి – హస్తమలకుడు.
v) కామకోటి మఠాము – తమిళనాడులోని తిరుచ్చిలో స్థాపించాడు. - తన తల్లి చివరి దశలో శంకరాచార్యుడు నిర్వహించిన పాత్రను తెల్పండి?
జ. శృంగేరిలో చాలా కాలం గడిపి, తన తల్లి చివరి దశలో వున్నదని తెలిసి, కాలడి వెళ్ళి, అంత్యకాలంలో ఆమెకు ఆత్మశాంతి కల్గించెను. ఆమె మరణించిన తర్వాత ఆమె భౌతికకాయమునకు దహనక్రియలు చేయుటకు ఆ గ్రామా లోని వారు సహకరించలేదు. కాని శంకరాచార్యుడు వారి గృహము వెనుకనే, నదీతీరమున ఆమె శరీరంను దహనం చేసెను. ఆ స్థలము ఈ నాటికిని ఒక పవిత్ర యాత్రా స్థలముగా పరిగణించబడుచున్నది.
- శంకరాచార్యులు భారతదేశంలో దర్శించి, స్థాపించిన వాటిలో కనీసము మూడు దేవాలయాలు ఏవనగా,
జ. i) కంచిలోని కామక్ష దేవాలయంలో శ్రీ చక్రము
ii) బద్రి లోని నరనారాయణ దేవాలయము
iii) నేపాల్ లోని గుహ్యేశ్శ్వరి దేవాలయము - భారతదేశ దిగ్విజయ యాత్ర తర్వాత శంకరాచార్యుల వారికి వచ్చిన బిరుదులు —
జ. పరమహంస, పరివ్యాజకాచార్య అను బిరుదులు వచ్చినవి .
- కాశీరంలోని ——— అలంకరించే అరుదైన గౌరవము శంకరాచార్యుల వారికి దక్కినది.
జ. సర్వజ్ఞ పఠము.
- నేపాల్లో చివరిసారిగా పర్యటించునపుడు ———- దర్శనం కలిగింది ఆపిమ్మట ———కి వెళ్ళి, అదృశ్యమై మరి తిరిగిరాలేదు శంకరుడు. తర్వాత ఆయన జాడ ఎవరికీ తెలియలేదు.
జ. శ్రీ దత్తాత్రేయ, కేదార్ నాథ్
- కొందరి అభిప్రాయం ప్రకారము శంకరాచార్యుల జీవితము ——–ముగిసినది అని.
జ. కామాక్షి దేవాలయం కంచిలో.
- శంకరాచార్యులు ఒక గొప్ప జ్ఞాన సిద్ధి పొందిన ——-అని సంస్కృ తిక ప్రతీక.
జ. ఋషి
- అద్వైతమనే సామ్రాజ్యంలో ————— అనేవి మనలో ప్రతిడిక్కరు పెంపొందించు కోవాలి.
జ. శాంతి, పరిపూర్ణత మరియు ఆనందము
- శంకర అనగా అర్థమేమి?
జ. సంసరృతంలో శం కరోతి ఇతి శంకరః శివుని ఆశీస్సులు పొందినవాడు, శివుడికి చెందినవాడు శంకరుడు అని అర్ధము .
- భజ గోవిందంలో ఎన్ని శ్లోకాలు కలవు?
జ. 31 శ్లోకాలు
- భజగోవిందంతో కలిసి వున్న ————-nఅనునవి ప్రకరణ గ్రంథాలు.
జ. ఆత్మబోధ
- ప్రకరణ గ్రంథాలు ఏవి?
జ. పరిచయం చేయబడిన ఆధ్యాత్మిక అధ్యయన గ్రంథాలను ప్రకరణ గ్రంథాలు అంటారు.
- భారతీయ గ్రంథాలపై వ్యాఖ్యానాలను ఏమందురు?
జ. భాష్యాలు.
- ఏ సందర్భము మరియు ఏ సంవత్సరమున స్వామివారు ‘భజగోవిందం’ను ప్రధాన విషయముగా తీసుకొని ప్రబోధలు చేసినారు?
జ. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు 1973వ సంవత్సరమున బృందావనంలో వేసవి తరగతులలో భాగంగా భారతీయ- సంస్కృతి – సంప్రదామీములో ప్రధాన విషయంగా భజగోవిందం గురించి ప్రభోదించిరి.
- “భజగోవిందం” పై స్వామి వారు వివరించిన చరణాలు ఎన్ని?
జ. 16.
- అపత్ సన్యాసం అంటి ఏమిటి?
జ. సన్యాస ఆశ్రమంలో వుండుట అనగా క్లిష్టమైన పరిస్థితిలో అధికారిక త్యజించడము.
- శంకరాచార్యులు రచించిన “భుజగోవిందం” గురించి క్లుప్తంగా వివరించండి.
జ. ఒకరోజు కాశీలో శంకరాచార్యాడు తన 14 మంది శిష్యులతో పర్యటిస్తున్నపుడు పెద్ద వ్యక్తి చదువుకోవడం గమనిం చాడు. పాణి యొక్క సంస్కృత నియమాలు శంకరుడికి జాలి కల్గించినది. అతని వయస్సులో అతని జీవితంలో మిగిలి వున్న కొద్ది సమయాన్ని భాష నేర్చుకోవడం కోసం వృధా చేయకుండా దేవుని ఆరాధన కోసం ఉపయోగించాలి అని అతనిని కోరాడు . అంతేకాక ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా మరణ ఘడియ సమీపిస్తున్నపుడు వ్యాకరణం యొక్క శ్లోకాలు ఆత్మను రక్షించవు. జీవిత సాగరాన్ని దాటడానికి భగవంతుని నామ స్మరణ తప్ప మరో మార్గం లేదు . ఆ సమమంలో భజగోవిందం శ్లోకాలను తెలియజేశారు.
ALSO PLEASE LEARN
All 16 Bhaja Govindam verses + Meanings of these verses from Path Divine textbook:
Pages 19 – 24