గాఢ నిశ్శబ్దంలో భగవంతుని వాణి వినిపిస్తుందని భగవాన్ బాబా వారు చెప్పారు.
నిశ్శబ్దంగా కూర్చోవడము అనునది మనల్ని మనము సరిదిద్దుకునే ప్రక్రియ. దీనివలన మనలో అంతర్గతంగా వున్న చైతన్యం బహిర్గతమవుతుంది.దివ్యత్వాన్ని మన జీవిత మార్గనిర్దేశక శక్తిగా ప్రతిష్టించుకున్న, మానసికంగా మనలో కలిగే మార్పులను మన మేధాశక్తి ద్వారా పర్యవేక్షించగలుగుతాము.
మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటే మన మనసు కూడా అంతే ఉన్నతంగా ఉంటుంది. చిన్నపిల్లలతో ఒకటి లేదా రెండు నిమిషాలు మాత్రమే నిశ్శబ్దంగా కూర్చోవడం అలవాటు చేయాలి. క్రమక్రమంగా దానిని పెంచాలి. ఇంట్లో కూడా ఆ అలవాటు క్రమం తప్పకుండా ఆచరించేలా చూడాలి. ఈ అలవాటును క్రమం తప్పకుండా, హృదయపూర్వకంగా అభ్యసిస్తున్న వారి మనసులో చంచలత్వం తగ్గి. ప్రశాంతత చోటు చేసుకుంటుంది. అంతేకాకుండా వారు చేసే పనిపై ఎక్కువ ఏకాగ్రత కల్గుతుంది.
పిల్లల వయసు మరియు సామర్ధ్యాన్ని పరిగణలోనికి తీసుకుని తరగతి ప్రారంభంలోను మరియు చివరిలోనూ నిశ్శబ్దంగా కూర్చునే అభ్యాసాన్ని కొనసాగించవచ్చు. దీనివలన నిలకడగా వినటం అలవడుతుంది. అంతేకాకుండా అంతర్గత నాదాలను మరియు మానసిక భావాలను వినగల్గుతారు.
క్రింద కొన్ని అభ్యాసాల జాబితా ఇవ్వబడినది.