త్రివిధం
ఆడియో
శ్లోకము
- త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః ।
- కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్ ।।
తాత్పర్యము
కామ, క్రోధ, లోభములు నరక ద్వారములు. ఆత్మ నాశనానికి, పతనానికి, అధోగతికి ఇవే కారణము. నరకానికి తీసుకుపోయే వీటిని వదిలివేయాలి.
వివరణ
త్రివిధం | మూడు రకములైన |
---|---|
నరకస్యేదం (నరకస్య + ఇదం) | నరకమునకు ఇవి |
ద్వారం | ద్వారములు |
నాశనమాత్మనః (నాశనం + ఆత్మనః) | ఆత్మను నాశనము చేయు |
కామః | కామము |
క్రోధః | క్రోధము |
తథా | మరియు |
లోభః | లోభము |
తస్మాదేతత్ = తస్మాత్ + ఏతత్ | కాబట్టి ఇవి |
త్రయం | మూడు |
త్యజేత్ | త్యజించవలెను (విడిచిపెట్టాలి) |
Overview
- Be the first student
- Language: English
- Skill level: Any level
- Lectures: 3