శివ శంభో

ఆడియో
సాహిత్యం
- శివ శంభో హర హర శంభో
- భవనాశా కైలాసనివాసా
- పార్వతీ పతే హరే పశుపతే
- గంగాధరా శివ గౌరీపతే
అర్థము
శివుడే హరుడు, శంభుడు. అతను భవ బంధాల నుండి విముక్తి ని కల్గిస్తాడు. కైలాసంలో నివాసం ఉంటాడు. సర్వ ప్రాణులకు ప్రభువు మరియు పార్వతీ దేవికి భర్త. తన యొక్క జటాజూటంలో గంగాదేవిని ధరించిన గౌరీ పతి ఈ శివుడు.
వివరణ
వివరణ
| శివ | మంగళ కరుడు |
|---|---|
| శంభో | ఆనందమును, శుభములను చేకూర్చువాడు. |
| హర | శివుడి యొక్క మరియొక పేరు. లయము చేయువాడు. |
| భవనాశ | ప్రాపంచిక బంధముల నుండి విముక్తి కల్గించు వాడు. |
| కైలాస నివాస | కైలాస పర్వతము నందు నివశించు వాడు. |
| పార్వతీ పతే | పార్వతీ మాత యొక్క భర్త |
| పశుపతే | సర్వ ప్రాణులను రక్షించే వాడు. |
| గంగాధర | గంగాదేవి (గంగా నది) ని ధరించిన వాడు |
| గౌరీ పతే | గౌరీదేవి (పార్వతీ దేవి) యొక్క భర్త |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి


















