ఎప్పుడైతే మనం చేసే పనులన్నీ ప్రేమపూర్వకంగా ఉంటాయో అదియే ధర్మము అని భగవాన్ శ్రీ సత్య సాయి బాబా గారు సెలవిచ్చారు. ప్రతీ జీవి పుట్టగానే తల్లి ద్వారా ప్రేమను పొందగలుగుతుంది. ఈ విధంగా పిల్లలు ఎప్పుడైతే పెద్దలను అనుసరిస్తారో అప్పుడు వారి జీవితాల్లో ప్రేమా మృతధార వెల్లివిరుస్తుంది.
“సత్కర్మలు”, “స్నేహము మరియు త్యాగము” అనే కథల ద్వారా మన ఆలోచనలు, ఆచరణ, అనుభూతి, అవగాహనలు ఎలా ప్రేమపూరిత మవుతాయో విశదీకరించబడినది.మొక్కలు, జంతువులు ప్రేమ వలన స్పందిస్తాయి. అలాంటి ప్రభావమే మానవ జీవితంపై కూడా పడకుండా ఉంటుందా?
ఒక జపాన్ సామెత “ఒక దయగల మాట మరియు చేత ప్రభావము వలన మూడు నెలల చలికాలం వెచ్చబడి ఉంటుంది”.