సత్యం యొక్క మరొక రూపమే ప్రేమ. ఇది ఆత్మతత్వం మూలం నుండి వెలువడినది. ప్రేమ పవిత్రమైనది, నిశ్చలమైనది, ప్రకాశవంతమైనది. నిర్గుణము, నిరాకారము, సనాతనము, నిత్యము, శాశ్వతము, అమృతము అను తొమ్మిది గుణములను కలిగి ఉన్నది. ప్రేమ ఎవరిని ద్వేషించదు. అందరినీ ఏకం చేస్తుంది. ఏకాత్మ దర్శనమే ప్రేమ.(ప్రేమాను భవము అద్వితీయమైనది).
మన ఆలోచనలు ప్రేమపూరితమవుతే, మన హృదయాల్లో సత్యం ఆవిర్భవిస్తుంది. అప్పుడే ప్రేమపూర్వక కర్మలు, నీతి బద్దమైన సాధన బహిర్గతమవుతుంది. మన హృదయంలో ని భావన ప్రేమతో కలిసి ముద్ద అయినచో, శాంతిని పొందగలుగుతాము.
ఒకవేళ మనము సృష్టిలో సర్వత్రా వ్యాపించియున్న ప్రేమ తత్వాన్ని అనుభవించి అర్థం చేసుకోగలిగితే, అప్పుడు అహింసా తత్వం మనలో నిబిడీకృతమై మనం చేసే సాధనాలు ప్రతిఫలిస్తాయి. ఆ విధంగా ప్రేమ అన్ని మానవతా విలువలకు అంతర్వాహినిగా ఉంటూ, దివ్యత్వాన్ని పెంపొందింపజేస్తుంది.
దైవం పై కలిగే ప్రేమయే భక్తి. ఈ విభాగంలో “విశ్వప్రేమ” అనే కథలో మహమ్మద్ ప్రవక్త జీవితంలో జరిగిన సంఘటన ద్వారా తనను ద్వేషిస్తున్న వ్యక్తి పై కూడా ప్రేమను పంచటం తెలియజేయ బడినది”.