యా కుందేందు
ఆడియో
పంక్తులు
- యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రావ్రుతా
- యా వీణా వరదండ మండితకరా
- యా శ్వేత పద్మాసనా
- యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా వందితా
- సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా
అర్ధము
మల్లెపూవువలె, చంద్రునివలె, మంచువలె, ముత్యమువలె స్వచ్ఛమైన ధవళ వస్త్రములను ధరించి శ్వేత పద్మమునందు ఆశీనురాలై, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మొదలైన దేవతలచే స్తుతింపబడుచు విద్యలకు దేవతవైన ఓం సరస్వతీ! మా మనస్సులనుండి అజ్నానమును పూర్తిగా తొలగింపుము
వీడియో
వివరణ
యా | ఎవరైతే |
---|---|
కుంద | మల్లెపూవు |
ఇందు | చంద్రుడు |
తుషార | స్వచ్ఛమైన మంచుబిందువులు |
హార | మాల, దండ |
ధవళా | తెల్లని తెలుపు |
శుభ్ర | స్వచ్ఛమైన, మచ్చలేని |
వస్త్ర | బట్టలు, వస్త్రములు |
ఆవృతా | ధరించిన |
వీణా | సంగీత వాయిద్యము |
వర | అందమైన |
దండ | వీణ యొక్క మెడ భాగము |
మండిత | అలంకరించబడిన |
కర | చేయి |
శ్వేత | తెలుపు |
పద్మము | తామరపువ్వు |
ఆసనా | ఆసనము |
బ్రహ్మ | బ్రహ్మదేముడు |
అచ్యుత | విష్ణుమూర్తి |
శంకర | శివుడు |
ప్రభృతిభిః | త్రిమూర్తులచేత స్తుతించబడు |
సదా వందితా | ఎల్లప్పుడూనమస్కరించబడు |
పాతు | కాపాడు |
సరస్వతి | ఙ్ఞానమును ప్రసాదించు దేవతnt |
భగవతీ | దేవీ |
నిశ్శేష జాడ్యాపహా | నా మనస్సు నుండి అఙ్న్ఞానమును తొలగింపుము |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి