పదవినోదం
లక్ష్యం:
ఈ ఆట ద్వారా పరిష్కారానికి అవసరమైన సమన్వయము మరియు సామాజిక నైపుణ్యాము మెరుగుపడతాయి.
సంబంధిత విలువలు:
- సమస్య పరిష్కారం
- నిర్ణయం తీసుకోవడం
- సమయ పాలన
కావలసిన పరికరములు:
కాగితంతో చేసిన చిన్న కార్డులు.
గురువు ముందస్తుగా తయారుచేయావలసినది:
- గురువు తన తరగతిలోని పిల్లల సంఖ్యకు అనుగుణంగా కార్డులను సిద్ధం చేస్తాడు.
- ప్రతి కార్డుపై గురువు రామాయణంలోని ఒక పాత్ర పేరు వ్రాయవలెను. ఉదా:- (వాల్మీకి, వాలి, దశరథుడు, శత్రుఘ్నుడు, జానకి, శబరి, విభీషణుడు, మైథిలి, మండోదరి, కైకేయి, కౌశల్య)
ఆట ఆడు విధానము
- గురువు కార్డులను పూర్తిగా కాలపి, క్రమమును మార్చేసి, ప్రతి ఒక్క బాలబాలికలకు ఒక కార్డును ఇవ్వవలెను.
- గురువు తమ పిల్లలను రెండు గ్రూపులుగా విభజించి ఆట నిర్వహించవలెను.
- రెండు గ్రూపులలోని పిల్లలు తమ కార్డుపైనున్న పేరు ప్రకారం (నిఘంటువులో వలె) అక్షర క్రమంలో నిలబడవలెను.
- సాధ్యమైనంత తక్కువ సమయంలో అక్షర క్రమములో నిలచిన గ్రూపు గెలుచును.
ఉదాహరణ: సమాధానం – కైకేయి, కౌశల్య, జానకి, దశరథుడు, మైథిలి, మండోదరి, శత్రుఘ్ను, శబరి, వాలి, వాల్మీకి, విభీషణుడు.
ఆటలోని వైవిధ్యత:
ఋషులు / సాధువులు, గొప్ప పురుషులు మరియు స్త్రీల పేర్లతో కార్లు తయారు చేయవచ్చును.
గురువులకు చిట్కాలు:
ఆట యొక్క క్లిష్ట స్థాయిని పెంచడానికి, ఒకే అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లతో కార్డులను తయారు చేయవలెను.