నవ పిరమిడ్
లక్ష్యం:
పిల్లలలో నూతనత్వం మరియు చురుకుదనాన్ని కోరుతూ ఒక ఉత్తేజకరమైన టీమ్-బిల్డింగ్ యాక్టివిటీ.
సంబంధిత విలువలు:
- అప్రమత్తత
- కలసిమెలిసి ఉండుట
- విచక్షణ
- చొరవ
కావలసిన పరికరములు:
కాగితం, పెన్ను / పెన్సిల్
గురువు ముందస్తుగా తయారుచేయావలసినది:
గురువు తన తరగతిలోని పిల్లల సంఖ్యకు అనుగుణంగా కొన్ని ఆకృతుల ఆధారంగా పదాల జాబితాను గురువు సిద్ధం చేయవలెను.
ఉదాహరణ:
పిరమిడ్, క్రాస్, త్రిశూల్, నక్షత్రం, స్వస్తిక్, డమరు, చెట్టు, చంద్రుడు, పర్వతం, వేణువు.
ఆట ఆడు విధానము:
- గురువు తన జాబితా నుండి ఒక పదాన్ని చెప్పవలెను (ఉదాహరణ: పిరమిడ్).
- పిల్లలందరూ కలిసి మానవ పిరమిడ్‌ను ఏర్పరచుకునే విధంగా తమను తాము ఏర్పరచుకొనవలెను.
- ప్రతి పిల్లలు ఈ మానవ పిరమిడ్‌లో భాగం అవవలెను.
- గురువు జాబితా నుండి ఒక్కొక్కటిగా పదాలను పిలుస్తూ ఆట కొనసాగుతుంది.
గురువులకు చిట్కాలు:
ప్రతి మానవ పిరమిడ్ పూర్తి అయిన తర్వాత ఆ ఏర్పాటు సంబంధిత ప్రశ్నలు అడగవచ్చును.