వెనకనుండి లెక్కించు
లక్ష్యం:
పేరు లో ఉన్నట్లే వెనుకనుండి లెక్కించుట ఒక బృంద ఆట. దీనిలో బాలవికాస్ లో నేర్చుకున్న విలువలను మొదటినుండి కాక క్రింద నుండి వరుసలో చెప్పాలి. ఈ విధంగా వారి దృష్టిని కేంద్రకరించుట ద్వారా సందేహించుట, వెనుకడుగు వేయుట అనే అలవాటు తగ్గుముఖం పడుతుంది. వారి లెక్కింపు శక్తి మరియు జ్ఞాపక శక్తి పెంపొందుతుంది.
సంబంధిత విలువలు:
- ఏకాగ్రత
- జ్ఞాపక శక్తి
- అప్రమత్తత
- ఆత్మ విశ్వాసము
- సమస్యలు పరిష్కరించుట
కావాల్సిన సామాగ్రి:
పెన్ను, పేపరు
గురువు ముందస్తు తయారీ:
గురువు చిన్న కాగితం ముక్కలలో వరుసలో క్రింద పేర్కొన్న విధంగా రాస్తారు.
- చతుర్విధ పురుషార్ధాలు
- చతుర్వేదాలు
- 4 యుగాలు
- పంచ పాండవులు
- పంచ ప్రాణాలు
- పచ్చ కోశాలు
- షడ్రిపులు
- దశావతారములు మొదలైనవి.
ఎలా ఆడాలి
- చిన్నారులను జతలు జతలుగా ఏర్పడమని చెప్పాలి.
- ఒక ఉదాహరణతో ఎలా ఆడాలో వివరించాలి.
- మొదట ఒక జత పిల్లలను పిలిచి – చతుర్విధ పురుషార్ధాలు అన్ని రాసి ఉన్న పేపర్ ఇవ్వాలి.
- ఒక చిన్నారి ధర్మ, అర్ధ, కామ, మోక్షాలని చెప్పాలి.
- జతలో ఉన్న ఇంకో చిన్నారి మోక్ష, కామ, అర్ధ ధర్మము అని చెప్పాలి.
- అలా జతలోని ఇద్దరూ చెబితే పాయింట్లు వస్తాయి.
- వారు చెప్పలేకపోతే ఇంకో జత పిల్లలకు అవకాశం వస్తుంది.
- ఇలా అందరు పిల్లలతో చేయించవచ్చు.
మార్పులు, చేర్పులు:
గ్రూప్ – 1 పిల్లలకు, త్రిమూర్తులు, త్రిగుణములు… ఇలా ఇవ్వవచ్చు.
గురువులకు సూచనలు:
ఈ ఆట తరచుగా ఆడిస్తే పిల్లలకు సులభంగా, సరదాగా బాలవికాస్ అంశాలు గుర్తుంటాయి.