సత్త్వం రజస్తమ ఇతి గుణాః
ఆడియో
శ్లోకము
- సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః ।
- నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ।।
తాత్పర్యము
ఓ మహా బాహువులు కల అర్జునా, భౌతిక ప్రాకృతిక శక్తి అనేది త్రిగుణములను కలిగి ఉంటుంది – సత్త్వ గుణము, రజో గుణము, మరియు తమో గుణము. ఈ గుణములే నాశములేని నిత్య జీవాత్మను దేహము నందు బంధించును.
వివరణ
సత్త్వం | సత్త్వ గుణము |
---|---|
రజః | రజో గుణము |
తమః | తమో గుణము |
ఇతి | ఇవి |
గుణాః | గుణములు |
ప్రకృతి సంభవాః | ప్రకృతి సిద్ధంగా పుట్టినటువంటివి ప్రకృతి కలిగి ఉండును |
నిబధ్నంతి | బంధించును |
మహాబాహూ | గొప్ప బాహువులు కలవాడా, అర్జునా |
దేహే | దేహము నందు |
దేహినమ్ | జీవాత్మను |
అవ్యయం | నాశనము లేని (నిర్వికారమైన) |
Overview
- Be the first student
- Language: English
- Skill level: Any level
- Lectures: 1