ఉద్ధరేదాత్మనాత్మానం
ఆడియో
శ్లోకము
- ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ।
- ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ।।
తాత్పర్యము
మానవుడు తనను తానే ఉద్ధరించుకోవాలి. తనకు తానే బంధువు. తనకు తానే శత్రువు. వివేకముతో దేహమును ఇంద్రియాలను అదుపులో ఉంచుకోగలిగిన మనస్సే మనకు బంధువు. వివేకవంతమైన మనస్సు వల్ల సంసారబంధముల నుంచి మానవుడు తనను తాను ఉద్ధరించుకొనగలడు. వివేకం లేక ఇంద్రియాలను అదుపు చేయని మనస్సు శత్రువుగా తయారవుతున్నది. అదే అన్ని బంధాలకు కారణం అవుతుంది. ఆ విధంగా తనకు తానే శత్రువు అవుతాడు.
వివరణ
ఉద్ధరేత్ | ఉద్ధరించుకొనవలెను |
---|---|
ఆత్మనా | తన్ను తాను, వివేకముతో కూడిన మనస్సు ద్వారా |
న | కాదు |
ఆత్మానం | నిన్ను నీవే |
అవసాదయేత్ | అధోగతి పొందించుకొను/ పతనం చేసుకొను |
ఆత్మైవ (ఆత్మా + ఏవ) | మనస్సే, తానే |
హ్యాత్మనో (హి+ ఆత్మనః) | ఎందుకనగా మనస్సే |
బంధు: | బంధువు/ మిత్రుడు |
ఆత్మైవ | మనస్సే, తానే |
రిపుః | శత్రువు |
ఆత్మనః | ఆత్మకు, తనకు |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 1