జననము
స్వామి వివేకానందునకు. సన్న్యాసాశ్రమస్వీకారమునకు పూర్వము- తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రనాథ దత్తుడు. అతడు విశ్వనాథ దత్తుడు, భువనేశ్వరీదేవి అను పుణ్యదంపతులకు 1863వ సం॥ జనవరి 12వ తేదీన, కలకతైనగరమున జన్మించెను. దత్తావంశము సంపన్నమైనది. గౌరవప్రదమైనది; విద్వదత్తునందును, దాసపరత్వమునందును ప్రసిద్ధి కెక్కినది. నరేంద్రనాథుని తాతగారైన దుర్గాచరణదత్తుడు సంస్కృతపారశీక భాషలలో గొప్పవిద్వాంసుడు. విశ్వనాధుడు జన్మించిన తరువాత అతడు సన్న్యాసాశ్రమము స్వీకరించి గృహమును వీడి వెడలిపోయెను.
విశ్వనాధుడు కలకత్తా హైకోర్టులో న్యాయవాదవృత్తిని నెరపు చుండెను. అతడుకూడ విద్వాంసుడే. భువనేశ్వరీదేవి సదాచారసంపన్ను రాలు. ఆమెకు పత్రికాసంతానమే కాని పుత్రసంతానము లేకుండెను. పుత్ర సంతానము కొర కాదంపతులు తపించుచుండిరి. భువనేశ్వరీదేవి పుత్ర లాభముకొరకు కాశీవిశ్వేశ్వరునికి సముచిత పూజాదికములను నిర్వహిం చుటకొరకు ఒకబంధువునుకోరెను. అత డ విశ్వేశ్వరునకు విశేషార్చ నములను అర్పించెను. తత్ఫలముగా ఒకనాడు శివు డాయిల్లాలికలలో ప్రత్యక్షమై, తానే పుత్రునిగా ఆపుణ్యదంపతులగర్భమునం దుదయింతు నని వరము ప్రసాదించెను.
నరేంద్రుడు బాల్యమునంను ఆటకారితనమును ప్రదర్శించుచున్నను, ఆధ్యాత్మికవిషయములందు ఆసక్తిని, అనురక్తిని చూపుచుండెను. సీతా రాము లన్నను, శివపార్వతు లన్నను అతనికి భక్తి మెండు. అదేవ తలవి గ్రహములముందు కూర్చుండి గాఢమైన ధ్యానములో ఆరాధించు చుండెను. అతనితల్లి చిన్ననాటినుండియు రామాయణ మహాభారత కథ లను చెపులలో నిల్లుకట్టుకొని చెప్పుచుండెడిది. ఆ కధలప్రభావము నరేంద్రునిపై చెరగని ముద్ర వైచెను. అతడు పుట్టుకతోనే అందగాడు దానికి తోడు ఉత్తమవర్చస్సుతో కూడికొనిన గంభీరరూపముకూడ బంగా రమునకు తావి యబ్బినట్లు అమరియుండెడిది. అతడెంత సుందరుడోఅంత దయామయుడు. ఎవరైనను బీదవారు తనను ఆర్థించినచో చేతి కందినవస్తు వేదై నను వెనుకముందులు చూచుకొనకుండ దానము చేయు చుండెడివాడు. యోగులన్నను, పుణ్యపురుషులన్నను నరేంద్రుడు అపార మైన భక్తి, గౌరవములను ప్రదర్శించుచుండెడివాడు. వారి నెన్నో విషయ ములను ప్రశ్నించి ఆధ్యాత్మికాంశములను తెలిసికొనుచుండెడివాడు. కాని, అతనికి దేనినైనను ప్రశ్నించెడి సాహసము, హేతుబద్ధముగా వాదించి, తగినప్రమాణములతో నిరూపింపబడిన అంశములను విశ్వసించు వివేకము సహజలక్షణములుగా నుండెడివి. ఆ విధమునా నరేంద్రుడు చిన్నప్పటి నుండియు మేధాహృదయముల ఉదాత్తలక్షణములు సమన్వయించుకొనిన విద్వత్తును, వివేకమును వ్యక్తీకరించుచుండెడివాడు.