ప్రపంచ వేదికపై – స్వామి వివేకానంద
వివేకానంద 31 మే 1893న తన చారిత్రాత్మక అమెరికా పర్యటనకు బాంబే నుండి బయలుదేరారు.
చైనా, జపాన్, కాంటన్ మీదుగా ప్రయాణించి, జూలై మధ్యలో చికాగో చేరుకున్నాడు. కాంటన్లో, ఆయన కొన్నిచోట్ల బౌద్ధ మఠాలను సందర్శించారు, జపాన్‌లో ఉన్న పారిశ్రామిక పురోగతిని మరియు ప్రజల పరిశుభ్రతను చూసి ముచ్చటపడ్డారు. ధనసంపదతో మరియు పాశ్చాత్యుల అవిష్కార ప్రతిభతో ప్రకాశిస్తూ ఉండే చికాగోను చూసి ఆయన చిన్న పిల్లవాడిలా ఆశ్చర్యపోయారు. చింతించవలసిన విషయం ఏమిటంటే, మతసభ (Parliament of Religions) సెప్టెంబర్ వరకు జరగదని, మరియు ఎవరైనా ప్రతినిధిగా ఉండడానికి ప్రమాణపత్రాలు ఉండాలని ఆయన తెలుసుకుని ఆయన చాలా నిరాశ చెందారు. కానీ, దైవకృపకు లోబడుతూ చికాగో కంటే తక్కువ ఖర్చుతో ఉండే బోస్టన్ వెళ్లారు. రైల్లో ప్రయాణిస్తుండగా ఆయనకు కాథరీన్ సాన్బోర్న్ అనే ఒక యువతితో పరిచయం ఏర్పడింది. ఆమె ఆయనను తన అతిథిగా బోస్టన్ రమ్మని ఆహ్వానించింది. ఆమె ద్వారా ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్ ని పరిచయం చేసుకున్నారు, ఆ ప్రొఫెసర్ వివేకానంద యొక్క జ్ఞాన మరియు తత్త్వశాస్త్రంలో ఉన్న వైవిధ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ ప్రొఫెసర్ మతసభ యొక్క అధ్యక్షుడికి పరిచయ పత్రాన్ని ఇస్తూ చెప్పాడు: “మన సర్వశ్రేష్ట ప్రొఫెసర్లకన్నా ఎక్కువగా తెలిసిన వ్యక్తి”. ప్రొఫెసర్ కూడా వివేకానందతో ఇలా చెప్పారు: “మీ ప్రమాణపత్రాలు అడగడం అంటే సూర్యుడు ప్రకాశించడానికి అనుమతి ఉందా అని అడగడం లాంటిదే!”
వివేకానంద మతసభ ప్రారంభమయ్యే కొన్నిరోజుల ముందు చికాగోకి తిరిగి వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు, ఆయన ఆసియా ప్రతినిధులకు అతిథ్యాన్ని అందించే కమిటీ చిరునామా పోగొట్టుకున్నారు. అది జర్మన్ మాట్లాడే ప్రజల ప్రాంతం కావడం చేత ఆయన మాటలు ఎవరికీ అర్థం కాలేదు. అలసిపోయి, రైల్వే సరుకు యార్డులో ఒక పెద్ద పెట్టెలో రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. మరుసటి ఉదయం, తన సమస్యను పరిష్కరించడానికి ఎవరైనా సహాయం చేయగలరా అని వెతకడం ప్రారంభించాడు. కానీ, వేరే దేశస్థుడు అవడం చేత సహాయం తక్షణమే లభించలేదు; ఫలితంలేని వెతుకులాటతో అలసిపోయి, దైవం పై భారం వేసి రోడ్డు పక్కన కూర్చున్నాడు. అకస్మాత్తుగా, ఎదురుగా ఉన్న ఫ్యాషన్ హౌస్ నుండి బయటకు వచ్చిన రాణి వంటి ఒక మహిళ, అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆమె మిసెస్ జార్జ్ డబ్ల్యు హేల్ (Mrs. George W Hale). వారి ఇల్లు, వివేకానంద అమెరికాలో ఉన్నంతకాలం దాదాపు ఆయన స్థిర చిరునామాగా మారింది; హేల్ కుటుంబ సభ్యులు అతని భక్తులుగా మారారు.
మతసభ 1893 సెప్టెంబర్ 11న ప్రారంభమైంది. ఆర్ట్ ఇన్స్టిట్యూట్ యొక్క విశాలమైన హాల్, దేశ సంస్కృతి యొక్క సౌందర్యాన్ని ప్రతిబింబించే సుమారు 7000 మంది ప్రజలతో నిండిపోయింది. వేదికపై, ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రతి వ్యవస్థీకృత మతానికి చెందిన ప్రతినిధులు ఉన్నారు. వివేకానంద, హిందూమతం కోసం ప్రతినిధిగా భావించవచ్చు, కానీ వాస్తవానికి, ఆయన ఏ ఒక్క మతం కాకుండా, లోతైనదైన ఒక సారాంశం కోసం నిలబడ్డాడు; ఆయన ప్రాచీన భారతీయ తత్వశాస్త్రం యొక్క విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక సత్యం కోసం నిలిచాడు. వివేకానంద ఇంత పెద్ద మరియు ప్రతిష్టాత్మకమైన సభను ఎప్పుడూ ఉద్దేశించి మాట్లాడలేదు. ఆయన చాలా ఉత్కంఠతో ఉన్నారు, కానీ తన మాటల సమయం వచ్చినప్పుడు, సరస్వతీ దేవిని మనసులో నమస్కరించి, తన ప్రసంగాన్ని “అమెరికా లోని సోదర, సోదరీమణులారా!” అనే మాటలతో ప్రారంభించాడు. వెంటనే, విస్తారమైన సభ ప్రేక్షకుల చప్పట్ల తో మారుమ్రోగింది. అది పూర్తిగా రెండు నిమిషాలు కొనసాగింది. ఏడు వేల మంది ప్రజలు తాము స్పష్టంగా నిర్వచించలేని ఏదో ఒక ఆశయం కోసం నిలబడ్డారు. అయితే, ఆయన కొనసాగిస్తూ ఇలా అన్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన సన్యాసుల క్రమం తరపున నేను మీకు అభివాదం చేస్తున్నాను; అన్ని తరగతులు మరియు వర్గాలకు చెందిన లక్షలాది మరియు మిలియన్ల మంది హిందూ ప్రజల ప్రతినిధిగా నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అది మూడు నుండి నాలుగు నిమిషాలకు మించని చిన్న ప్రసంగం మాత్రమే. కానీ ఇది హిందూ విశ్వాసం ఆధారంగా అన్ని మతాలు ఒకటే దేవునికి మార్గాలనే సిద్ధాంతం, మతసభను గొప్పగా ప్రభావితం చేసింది. “మేము కేవలం సార్వత్రిక సహనాన్ని విశ్వసించడం మాత్రమే కాదు, భూమి మీద ఉన్న అన్ని మతాలను మరియు అన్ని జాతులను అంగీకరిస్తాము” అని ఆయన అన్నారు. ఆయన చివరగా, “ఈ సంఘాన్ని గౌరవిస్తూ ఈ ఉదయం మోగిన గంట, కత్తి లేదా కలంతో జరిగే హింసలకు, లక్ష్యానికి చేరుకునే మార్గంలో వ్యక్తుల మధ్య ఉన్న అప్రియమైన భావాలకు మరణ ఘంటిక అవుతుంది అని నేను తీవ్రంగా ఆశిస్తున్నాను” అని అన్నారు. ఏ హిందువు యొక్క సర్వతోముఖసహనం, మరియు అన్ని మతాల ఏకత్వం పై ప్రగాఢ విశ్వాసం, శ్రీ రామకృష్ణ అనుభవాలచే నిర్ధారింపబడిందో, అటువంటి వ్యక్తి, ఈ మహోన్నత సభలో ఇటువంటి ప్రసంగం చేయగలడు. వివేకానంద యొక్క సరళమైన, హృదయపూర్వకమైన మాటలు, గొప్ప వ్యక్తిత్వం, ప్రకాశవంతమైన ముఖము, మరియు కాషాయ దుస్తులు ఆ సభ పై గొప్ప ప్రభావం చూపాయి. తదుపరి రోజు, పత్రికలు అతనిని మతసభలో అత్యంత ప్రముఖ వ్యక్తిగా వర్ణించాయి; భిక్షాపాత్రతో ఉన్న సాధారణ సన్యాసి ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్యాధికారి అయ్యాడు.
పార్లమెంట్లో స్వామీజీ యొక్క తదుపరి ప్రసంగాలను అందరు గొప్ప గౌరవం మరియు ప్రశంసలతో ఆలకించారు, ఎందుకంటే అవన్నీ సార్వజనీనత యొక్క ముఖ్యాంశాన్ని కలిగి ఉన్నాయి.
ఇతర మతస్తుల ప్రాణాలను రక్షించడానికి విదేశాలకు మిషనరీలను పంపడంలో ఆసక్తి, ఆ ప్రజల శరీరాలను ఆకలితో మృత్యువు నుండి రక్షించడానికి ఎందుకు ప్రయత్నించరని అమెరికా క్రైస్తవులను ఆయన అడిగారు.”
చివరి సమావేశంలో, సెప్టెంబర్ 27న, స్వామి వివేకానంద మళ్లీ లేచి పార్లమెంట్లో చాలా సందర్భాల్లో చెప్పబడిన మతాల ఏకత్వం, ఏ ఒక్క మతం విజయం మిగిలిన మతాల వినాశనం ద్వారా సాధించబడదని స్పష్టంగా ప్రకటించారు. “నాకు క్రైస్తవుడు హిందువు కావాలని ఉందా? లేదా హిందువు లేదా బౌద్ధుడు క్రైస్తవుడు కావాలని ఉందా? అనే అనుమానం రాకూడదు. క్రైస్తవుడు హిందువుగా మారాల్సిన అవసరం లేదు, హిందువు లేదా బౌద్ధుడు క్రైస్తవుడిగా మారాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి మతం ఇతర మతాల నుండి స్ఫూర్తిని పొందాలి, అయితే తన స్వతంత్రతను కాపాడుకుంటూ, తన ధర్మాన్ని అనుసరించి ఎదగాలి.”
వివేకానంద తన వేదాంత ఉపన్యాసాల్లో ఎల్లప్పుడూ, “దేవుడు మన అందరిలో ఉన్నాడు; చీమ మరియు దేవదూత మధ్య తేడా చూడకండి” అని చెప్తారు. మరొక మాటలో చెప్పాలంటే, మనలో ప్రతి ఒక్కరూ తన దైవ స్వభావాన్ని తిరిగి కనుగొనటానికి జన్మించారు. ఆయనకు ఇష్టమైన ఒక సింహం కథ, ఒక సింహం తనను గొర్రెగా భావించేది. మరో సింహం తన ప్రతిబింబాన్ని చూపించేవరకు ఈ సింహం గొర్రె లాగా ప్రవర్తించేది. వివేకానంద శ్రోతలతో “మీరే సింహాలు” అని చెప్తారు. “మీరు పవిత్రమైన, అనంతమైన, సంపూర్ణమైన ఆత్మలు. మీరు ఎవరి కొరకు చర్చిలు మరియు ఆలయాలలో ఏడుస్తూ, ప్రార్థిస్తూ ఉన్నారో, ఆ దేవుడు మీరే.” ఆయన హిందూ మతంలో రామ, కాళి, విష్ణు మొదలైన దేవతలకు భక్తులైన భక్తి వివిధ వర్గాలు పాటించే పద్ధతుల గురించి తక్కువగా మాట్లాడేవారు. కానీ అప్పుడప్పుడూ మాత్రమే తన వ్యక్తిగత పద్ధతిని ప్రస్తావించి, తనకు దైవ అవతారమైన ఒక గురువు ఉన్నారు మరియు వారు పది సంవత్సరాల క్రితం వరకు జీవించారు అని వెల్లడించేవారు. పాశ్చాత్య దేశాల్లో శ్రీ రామకృష్ణ మహిమను కీర్తించడంలో తన నియంత్రణ గురించి ప్రస్తావిస్తూ, “నేను శ్రీ రామకృష్ణ వ్యక్తిత్వాన్ని ప్రబోధించినట్లయితే, నేను ప్రపంచంలో సగభాగాన్ని మార్చివేసి ఉండేవాడిని, కానీ అది తాత్కాలికంగా ఉండేది. అందువల్ల నేను శ్రీ రామకృష్ణ సూత్రాలను ప్రబోధించాను. ప్రజలు ఆ సూత్రాలను అంగీకరిస్తే, వారు చివరికి ఆ వ్యక్తిత్వాన్ని అంగీకరిస్తారు” అని చెప్పేవారు.
ఆయన ఇంగ్లాండ్‌లో కూడా మూడు నెలలపాటు చిన్న పర్యటన చేశారు మరియు అక్కడ కూడా తన సందేశానికి స్పందన తక్కువగా లేదని కనుగొన్నారు. ఇక్కడ, ఆయన గొప్ప పండితుడు మాక్స్ ముల్లర్‌ను కలుసుకున్నారు. తర్వాత ఆయన అమెరికాలో తన పనిని బలపరచాలని, వేదాంతాన్ని ప్రబోధించడానికి మరియు అన్ని మతాలకు ప్రాథమికమైన విశ్వ సూత్రాలను వర్తింపజేయడానికి, సకల మతాలకు అతీతమైన న్యూయార్క్ వేదాంత సమాజం అనే సంస్థను స్థాపించారు. ఆయన రాజయోగ మరియు జ్ఞానయోగంపై పుస్తకాలు వ్రాశారు. యూరోప్‌లో కూడా పర్యటించారు. ఆయన పర్యటించిన ప్రతిచోటా, ఆయన చుట్టూ నిష్ణాతులైన మరియు చురుకైన శిష్యులు చేరారు, అందులో ముఖ్యంగా కెప్టెన్ సీవియర్, మరియు అతని భార్య, వీరితోపాటు సిస్టర్ నివేదితగా ప్రసిద్ధి చెందిన మిస్ మార్గరెట్ నోబుల్ ఉన్నారు. ఇప్పుడు ఆయన స్వంత మాతృభూమి ఆయనను పిలుస్తోంది మరియు తన సందేశాన్ని స్వీకరించడానికి ఆతురతగా ఉంది. కాబట్టి, 1896 చివర్లో లండన్ నుండి, ఆయన భారతదేశానికి బయలుదేరారు.