ఓంకారం

ఆడియో
పంక్తులు
- ఓంకారం బిందుసంయుక్తం
- నిత్యంధ్యాయన్తి యోగినః
- కామదం మోక్షదం చైవ
- ఓంకారాయ నమోనమః
అర్ధము
యోగులెప్పుడును బిందువుతో కూడిన ఓంకారమును ధ్యానింతురు, అది కోరికలు తీర్చును. మోక్షము నొసంగును. అట్టి ఓంకారమునకు నమస్కారము. “ఓం” అనునది దేవుని ధ్వని చిహ్నము. వ్యక్తిగతమైన జీవాత్మను సూచించు బిందువు రూపరహితమైన “ఓం”చే సూచింపబడు (దానికి ప్రతినిథియైన) విశ్వజనీనమైన పరమాత్మతో కలసిపోవును. యోగులీ నిత్య సంబంధమును ధ్యానింతురు.
వీడియో
వివరణ
| ఓంకారం బిందుసంయుక్తం | బిందువుతో కూడిన ఓంకారం |
|---|---|
| నిత్యం | ప్రతి రోజూ |
| ధ్యాయన్తి | ధ్యానించు |
| యోగినః | యోగులు |
| కామదం | కోరికలు తీర్చునది |
| మోక్షదం | మాయను పోగొట్టి మోక్షమును ప్రసాదించునది |
| చైవ | మరియు |
| ఓంకారాయ నమో నమః | ఓంకారమునకు నమస్కరించుచున్నాను |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 4
-
కార్యాచరణ
-
మరింత చదవడానికి






