అంత్యాక్షరి అనేది పాటలతో కూడుకున్న సంగీతపరమయిన ఒక ఆట. భారత దేశం లో ఏ వయసు వారయినా ఇళ్ళల్లో కానీ, వేడుకలలో కానీ, సమావేశాలలో కానీ హృద్యమైన కాలక్షేపం కోసం ఆడుకునే ఒక ప్రసిద్ధమైన ఆట. అంత్యాక్షరి లో పేరులో సూచించినట్లుగా ప్రతి జట్టు మునుపటి జట్టు పాడిన పాట చరణం యొక్క చివరి పదం లోని ముగింపు అక్షరం తో ప్రారంభం అయ్యే పాట యొక్క చరణం పాడాలి. సాయి భజన అంత్యాక్షరి అనేది ఈ ప్రసిద్ధమైన పాటల అంత్యాక్షరి అనే ఆటనుండి ప్రేరణ పొందిన ఒక ఆధ్యాత్మికమైన ఆట. సాయి భజన అంత్యాక్షరి యొక్క ముఖ్యమైన లక్షణాలు:
- ఈ ఆటలో సాయి భజనలు మాత్రమే పాడాలి.
- మామూలుగా ఆడే అంత్యాక్షరి విధానమే కాకుండా ఇంకా అనేక వినూత్నమైన అంశాలు కూడా ఈ ఆటలో చేర్చబడ్డాయి.
- ఈ ఆట యొక్క ప్రతి వృత్తం ఒక ప్రత్యేక విధానాన్ని కలిగి ఉంటుంది. ఇది ఆటను మరింత ఆసక్తి కరంగా ఉత్సాహకరంగా సవాలుగా చేస్తుంది.
ఈ విభాగం 30 వృత్తాల గురించి వివరంగా తెలియచేస్తుంది. ప్రతియొక్క వృత్తం ఒక విశిష్టమైన విధానంతో ఉంటుంది. ప్రతియొక్క విధానానికి సరిపోయేలా భజనపాటలు ఉదాహరణలుగా ఇవ్వబడ్డాయి. ఈ విధంగా 350 భజనలు వివిధ వృత్తాలలో ఇవ్వబడ్డాయి.