శ్రీ సత్య సాయి అష్టోత్రం[28-54]
వివరణ
ఆడియో
శ్లోకము
- ఓం శ్రీ సాయి రత్నాకర వంశోద్భవాయ నమః
రత్నాకర వంశమున జన్మించినవాడు.
- ఓం శ్రీ సాయి షిర్డిసాయి అభేద శక్త్యావతారాయ నమః
షిర్డిసాయి మహిమకు, కీర్తికి భిన్నము కానటువంటివాడు.
- ఓం శ్రీ సాయి శంకరాయ నమః
శివ స్వరూపుడు.
- ఓం శ్రీ సాయి షిర్డిసాయి మూర్తయే నమః
షిర్డిసాయి యొక్క అవతారమే (శ్రీ సత్యసాయి) అయినవాడు.
- ఓం శ్రీ సాయి ద్వారకామాయి వాసినే నమః
ద్వారకామాయి యందు నివసించువాడు.
- ఓం శ్రీ సాయి చిత్రావతీ తట పుట్టపర్తి విహారిణే నమః
పుట్టపర్తి వద్ద గల చిత్రావతీ నది ఒడ్డున లీలలు చూపినవాడు (లేక) విహరించినవాడు.
- ఓం శ్రీ సాయి శక్తి ప్రదాయ నమః
శక్తిని యిచ్చువాడు (ధార్మిక శక్తి).
- ఓం శ్రీ సాయి శరణాగత త్రాణాయ నమః
శరణు కోరినవారిని రక్షించువాడు.
- ఓం శ్రీ సాయి ఆనందాయ నమః
ఆనందరూపుడు (బ్రహ్మానందము).
- ఓం శ్రీ సాయి ఆనందదాయ నమః
ఆనందమును అందించువాడు.
- ఓం శ్రీ సాయి ఆర్తత్రాణ పరాయణాయ నమః
దుఃఖములలో, బాధలలో వున్నవారిని ప్రత్యేకముగా రక్షించువాడు.
- ఓం శ్రీ సాయి అనాధ నాథాయ నమః
దిక్కులేని వారికి ప్రభువు, రక్షకుడు.
- ఓం శ్రీ సాయి అసహాయ సహాయాయ నమః
(నిస్సహాయులకు) సహాయము లేని వారికి సహాయకుడు.
- ఓం శ్రీ సాయి లోక బాంధవాయ నమః
ప్రపంచమంతా బంధువులు, స్నేహితులు కలవాడు.
- ఓం శ్రీ సాయి లోక రక్షా పరాయణాయ నమః
ప్రజలను రక్షించుట యందు పూర్తిగా లీనమయినవాడు.
- ఓం శ్రీ సాయి లోకనాధాయ నమః
ప్రపంచమునకు (జగత్తు)నకు ప్రభువు.
- ఓం శ్రీ సాయి దీన జన పోషణాయ నమః
దు:ఖితులను, దీనులను పోషించి కాపాడుటకు ఆధారమయినవాడు.
- ఓం శ్రీ సాయి మూర్తిత్రయ స్వరూపాయ నమః
త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దివ్య అవతారమూర్తి.
- ఓం శ్రీ సాయి ముక్తి ప్రదాయ నమః
మోక్షమునిచ్చువాడు, జనన మరణముల నుండి (విడుదల) విమోచనము యిచ్చువాడు.
- ఓం శ్రీ సాయి కలుష విదూరాయ నమః
మాలిన్యమును (లోపములను) తొలగించువాడు.
- ఓం శ్రీ సాయి కరుణాకరాయ నమః
దయ కలిగినటువంటివాడు.
- ఓం శ్రీ సాయి సర్వాధారాయ నమః
అందరికీ, అన్నిటికీ ఆధారమయినటు వంటివాడు.
- ఓం శ్రీ సాయి సర్వ హృద్వాసినే నమః
సర్వజీవుల హృదయములలోను నివసించువాడు.
- ఓం శ్రీ సాయి పుణ్యఫల ప్రదాయ నమః
సత్కర్మలకు ఫలితములు యిచ్చువాడు.
- ఓం శ్రీ సాయి సర్వ పాప క్షయ కరాయ నమః
సర్వ పాపములను నశింప చేయువాడు.
- ఓం శ్రీ సాయి సర్వ రోగ నివారిణే నమః
శారీరిక మానసిక రోగములను నయము చేయువాడు.
- ఓం శ్రీ సాయి సర్వ బాధ హరాయ నమః
అన్ని విధములయిన బాధల నుండి రక్షించువాడు.
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 10