నమస్తేస్తు

ఆడియో
పంక్తులు
- నమస్తేస్తు మహామాయే – శ్రీ పీఠే సుర పూజితే
- శంఖ చక్ర గదా హస్తే – శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే
అర్ధము
మాయ అను చీకటిని తొలగించి సకల శుభములను, సంపదలను అనుగ్రహించు తల్లీ ! ఎల్లదేవతలచే పూజింపబడి, హస్తము నందు శంఖమును, చక్రమును, గదను ధరించిన ఓ మహాలక్ష్మీ ! నీ పాదపద్మములకు నేను ప్రణమిల్లు చున్నాను.
వివరణ
వివరణ
| నమస్తేస్తు | నేను నమస్కరించుచున్నాను |
|---|---|
| మహా | గొప్ప |
| మాయే | భ్రమను తొలగించునది |
| శ్రీ | శుభము, సంపద ప్రసాదించునది |
| పీఠే | కూర్చుని ఉన్న |
| సుర | దేవతలు |
| పూజితే | పూజింపబడు |
| శంఖ | శంఖము, సంపదలకు ప్రతీక |
| చక్ర | చక్రము, కాలచక్రమునకు ప్రతీక |
| గద | బలమునకు ప్రతీక |
| హస్తే | చేతులలో |
| మహా | గొప్ప |
| లక్ష్మీ | సంపదలకు మూలమైనది |
| నమోస్తుతే | నమస్కరించుచున్నాను |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి




















