ఓం సహనావవతు

ఆడియో
పంక్తులు
- ఓం సహనావవతు ! సహనౌభునక్తు !
- సహ వీర్యం కరవావహై !
- తేజస్వి నా వధీతమస్తు మా విద్విషా వహై !
- ఓం శాంతిః శాంతిః శాంతిః
అర్ధము
ఈశ్వరుడు మనల నిరువురిని రక్షించుగాక, అతడు మనల నిరువురను పోషించుగాక, మనము గొప్ప శక్తితో (దివ్యబలముతో) కలసి పని చేయుదుముగాక.
అధ్యయనముచే మనమిఱువురము మేధా సంపదను పొందుదుముగాక, మన మొండొరులను ద్వేషింపకుందుముగాక. శాంతి, శాంతి, శాంతి సర్వత్రా వుండుగాక !
(ఈ వైదిక ప్రార్దన ప్రేమ, సౌభ్రాతృత్వము, శాంతి సామరస్యము అను ఉదారములైన ఆశయములను ప్రకటించునని అర్థం)
వివరణ
వివరణ
సహ | ఇద్దరిని |
---|---|
నౌ | మన |
అవతు | ఈశ్వరుడు రక్షించు గాక |
సహనౌ | ఇద్దరికి |
భునక్తు | వృద్ధి కలుగు గాక |
సహ | ఇద్దరమూ |
వీర్యం | శక్తి, సామర్ధ్యములతో |
కరవావహై | కలిసి పరిశ్రమించుదుము గాక |
తేజస్వి | మేధస్సు, వెలుగు |
నౌ | మన |
అధీతమ్ | శ్రమ ఫలవంతము |
అస్తు | అగు గాక |
మా విద్విషా వహై | ఇద్దరి మధ్యా విభేదాలు తలయెతౖకుండు గాక |
శాంతిః | శాంతి |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి