శాంతాకారం శ్లోకము
ఆడియో
పంక్తులు
- శాంతాకారం భుజగశయనం – పద్మనాభం సురేశం
- విశ్వాధారం గగన సదృశం – మేఘవర్ణం శుభాంగం
- లక్ష్మీ కాంతం కమలనయనం – యోగిభిర్ధ్యాన గమ్యం
- వందేవిష్ణుం భవ భయహరం – సర్వలోకైక నాథం
అర్ధము
శాంత స్వరూపా! భుజగశయనా! నాభి యందు పద్మము గలవాడా! దేవతలకు అధిపతియైనవాడా! విశ్వమునకు ఆధారమైనవాడా! ఆకాశము వలె వ్యాపించినవాడా! మేఘము వంటి నీలమైన వర్ణము కలవాడా! శుభమైన అంగములు కలవాడా! లక్ష్మీపతీ! కమల నయనా! యోగులకు ధ్యానగమ్యము నీవే. ఓ విష్ణు! సంసార భారమును హరించువాడా! నీకు నమస్కరించుచున్నాను.
వివరణ
వివరణ
శాంతాకారం | శాంతమే ఆకారమైనవాడు |
---|---|
భుజగశయనం | పాము పడగగా కలవాడు |
పద్మనాభం | పద్మము నాభియందు కలవాడు |
సురేశం | దేవతలకు ప్రభువైనవాడు |
విశ్వాధారం | ప్రపంచమునకు ఆధారమైనవాడు |
గగనసదృశం | ఆకాశముని పోలినవాడు |
మేఘవర్ణం | నల్లని మబ్బువంటి రంగు కలవాడు |
శుభాంగం | అందమైన శరీర అంగములు కలవాడు |
లక్ష్మీ కాంతం | లక్ష్మీ దేవికి భర్త అయినవాడు |
కమలనయనం | తామరపువ్వు వంటి నేత్రములు కలవాడు |
యోగిభిర్ధ్యాన గమ్యం | యోగుల హృదయమునకు గమ్యమైనవాడు |
వందే | నమస్కారము |
విష్ణుం | విష్ణుమూర్తి |
భవ భయ హరం | పుట్టుక వలన కలుగు బాధల నుంచి రక్షించు వాడు |
సర్వలోకైకనాధమ్ | సర్వలోకాలకు ఆది నాధుడు |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 3
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి