శ్రీ రాముని కథ అయినటువంటి శ్రీమద్రామాయణము ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్యాన్వేషకులకు అందరికీ ఆదర్శ ప్రాయమైనది. రామాయణము కర్తవ్యం, సత్యం, భక్తి, విశ్వాసం, సత్ప్రవర్తన, మరియు శరణాగతి వంటి పవిత్ర ఆదర్శములకు ఆధారమైనది. ఈ ఇతిహాసం తల్లిదండ్రుల పట్ల విధేయత చూపటం, క్రమశిక్షణను పాటించటం, ధర్మాన్ని అనుసరించడం వంటి ఉన్నత వ్యక్తిగత ఆదర్శాలను ప్రదర్శిస్తుంది.
“అందరూ తమ ధర్మానికి కట్టుబడి ఉంటూ, వారి వారి జీవితాల్లో విలువలను పెంపొందించుకుంటూ ఆనందాన్ని పొందాలి” అన్నది ఈ బోధనల సారాంశం.
“మానవాళి ఆదర్శప్రాయమైన జీవితాన్ని ఎలా గడపాలో భగవంతుడు చూపిన మార్గమే రామాయణం” అని స్వామి చెప్పారు. అంతేకాక ఈ కలియుగంలో రామనామస్మరణ మోక్షానికి మార్గమని కూడా నొక్కి చెప్పారు. (శ్రీరామనవమి దివ్య సందేశము మార్చి 30, 2004)
మొదటి వర్గము పిల్లలకు రామాయణంలోని సత్యం, విధేయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం వంటి విలువల పై దృష్టిని కేంద్రీకరిస్తూ, రామాయణాన్ని ఒక కథగా చెప్పవచ్చు. రామాయణములోని తెలియని విషయాలను సవివరంగా తెలిపే గ్రంథమే స్వామి వారు రచించిన రామకథా రసవాహిని.

 
                                


















![శ్రీ సత్య సాయి అష్టోత్రం[28-54]](https://sssbalvikas-s3.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2021/04/ashtothram-tiles.png)

